ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు రాయితీ బస్‌ పాస్‌లు

ABN, First Publish Date - 2022-07-01T06:20:37+05:30

స్కూళ్లు, కళాశాలలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యా ర్థుల కోసం రాయితీ బస్‌ పాస్‌లు జారీ చేసేందుకు ప్రజా రవాణ సంస్థ సిద్ధ మయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, జూన్‌ 30 : స్కూళ్లు, కళాశాలలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యా ర్థుల కోసం రాయితీ బస్‌ పాస్‌లు జారీ చేసేందుకు ప్రజా రవాణ సంస్థ  సిద్ధ మయింది.   5 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే కొన్ని కాలేజీలు తెరుచుకున్నాయి. గతంలో మాదిరిగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు బస్‌పాస్‌ను జారీ చేసేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిం ది. జిల్లాలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు డిపోలతో పాటు పాలకొల్లు వంటి బస్టాండ్‌ల్లో కూడా పాస్‌ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఆర్టీసీ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దానిపై సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ సంత కం చేయించాలి. ఆధార్‌ కార్డు, ఫొటోను దీనికి జత చేసి కౌంటర్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. నెల, మూడు నెలలు, ఆరు, ఏడాది పాటు రాయితీ పాస్‌లు జారీ చేస్తారు. 20 కిలోమీటర్ల లోపు వచ్చే విద్యార్థులకు నెలకు రూ.290, అదే మూడు నెలలకు అయితే రూ.790 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 50 కిలోమీటర్లు లోపు నుంచి వచ్చే విద్యార్థులకు దూరాన్ని బట్టి రాయితీ పాస్‌లను జారీ చేయనున్నారు.పాఠశాలల్లో చదివే 12 ఏళ్లు లోపు విద్యార్థులందరికీ ఉచితంగా బస్‌ పాస్‌ లను జారీ చేస్తుండగా పన్నెండేళ్లు దాటితే పాస్‌ తీసుకోవాల్సి ఉంటుంది.  బాలి కలు పదో తరగతి వరకు బస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇవి   నెల, మూడు నెలలు, ఆరు, ఏడాది పాటు పాస్‌లు ఇస్తా రు. ఉచిత పాస్‌ తీసు కునే విద్యార్థులు ఫొటో, దరఖాస్తుపై హెచ్‌ఎం సంతకం చేయించి కౌంటర్లలో ఇవ్వాల్సి ఉంటుందని ఆర్టీసీ ఆర్‌ఎం వీరయ్య చౌదరి చెప్పారు. 

Updated Date - 2022-07-01T06:20:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising