ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్వా.. విలవిల

ABN, First Publish Date - 2022-09-13T05:33:38+05:30

ప్రకృతి మారిన ప్పుడల్లా ఆక్వా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోరు వానలు.. ఆపై ఎండలు
ఆక్సిజన్‌ లెవల్స్‌ హెచ్చుతగ్గులు
ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు
ఆక్వా రైతులకు అదనపు పెట్టుబడులు


భీమవరం, సెప్టెంబరు 12 : ప్రకృతి మారిన ప్పుడల్లా ఆక్వా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అల్పపీడనం కారణంగా నాలుగు రోజులు గా కురుస్తున్న వానలు.. అంతలోనే ఎండ వాతావరణం.. రొయ్యకు చేపకు తీరని నష్టం కలుగుతోందని రైతులు వాపోతున్నారు. వర్షాల కారణంగా చెరువుల్లో నీళ్లు చేరుకోవడంతో రొయ్యలు బతకడానికి అనుకూలమైన ఉప్పు నీటిశాతం కరిగిపోతుంది. 8–9 పీపీటీల నీటిశాతం తగ్గిపోవడంతో రొయ్యలు ఉక్కిరిబిక్కిరవుతున్నా యి. ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. చేపల చెరువులకు ఆక్సి జన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. ఏరియేటర్లు వినియోగించడంతో పాటు అదనపు పెట్టుబడి పెడుతున్నారు. చేప రైతులు ఇదే పరిస్థితితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ఎదు ర్కొవడానికి ప్రోబయోటిక్స్‌ వాడకం తప్పనిసరి. తద్వారా  నీటిలో అనుకూల వాతావరణం సమతుల్యత కొనసాగే విధం గా చర్యలు తీసుకోవల్సి వస్తోంది. ఆకస్మికంగా సోమవారం ఉదయం నుంచి వర్షం తగ్గి ఎండకాయడం వల్ల ప్రతికూల వాతావరణం నెలకొంది. ఇటీవల సుమారు పదివేల ఎకరాల్లో కొత్తగా రొయ్య పిల్లలు వదిలారు. ప్రతికూల వాతావరణంతో ఈ నాలుగు రోజుల్లో ఎకరానికి కనీసం 10 నుంచి 20 వేల రూపాయల వంతున అదనపు పెట్టుబడులు పెట్టుకోవాల్సి వస్తోంది. వర్షం కురిసినపుడల్లా వాతావరణం ప్రతికూలంగా మారిప్పుడల్లా ఎక్కువగా ఆక్వా రైతులు అదనపు పెట్టుబడి పెడుతూ ఆర్థిక ఇబ్బందుల బారిన పడాల్సి వస్తోంది.

Updated Date - 2022-09-13T05:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising