ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ నిట్‌ తదుపరి సారథి ఎవరు?

ABN, First Publish Date - 2022-12-16T00:09:28+05:30

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇమేజ్‌ మసకబారుతోందా! పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో ఇటీవల చోటు చేసుకు న్న పరిమాణాలు అవే అనుమానాలకు తావిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డైరెక్టర్‌ కాంట్రాక్ట్‌ రద్దుచేసిన కేంద్రం

ఇన్‌చార్జుల పాలనలోనే విద్యాసంస్థ

కీలక పదవులు భర్తీ చేస్తేనే పూర్వ వైభవం

ఇటీవల పరిణామాలతో మసక బారిన ప్రభ

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇమేజ్‌ మసకబారుతోందా! పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో ఇటీవల చోటు చేసుకు న్న పరిమాణాలు అవే అనుమానాలకు తావిస్తున్నాయి. ఏపీ నిట్‌లో సీబీఐ దర్యాప్తు అనంతరం డైరెక్టర్‌ తొలగింపు వరకు చోటు చేసుకున్న పరిమాణాలు అందుకు ఊతమిస్తున్నాయి. నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు తొలగింపు వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తగా... ఆయన కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీచేసింది. అయితే మూడు నెలల వేతనాన్ని అదనంగా చెల్లించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. తక్షణమే మూడు నెలల వేతనం చెల్లించాలని రాష్ట్ర హైకో ర్టు దిశానిర్దేశం చేసింది. దాంతో డైరెక్టర్‌ తొలగింపు ప్రక్రి య ముగిసింది. వాస్తవానికి ఏపీ నిట్‌ డైరెక్టర్‌ తొలగింపు కోసం నెలకొన్న పరిస్థితులు తొలి నుంచీ ఉత్కంఠకు దారితీశాయి. రెగ్యులర్‌ ఉద్యోగాల కల్పనలో నిబంధనలకు విరుద్ధంగా నలుగురికి ఉద్యోగాలు కల్పించారన్న అభియోగాల తో డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావుపై సీబీఐ దర్యాప్తు నిర్వహించింది. సీబీఐ దర్యాప్తు సాగుతుండగానే డైరెక్టర్‌ను మూడు నెలలపాటు సస్పెండ్‌ చేశారు. మరోవైపు సీబీఐ దర్యాప్తు చేపట్టి ఆరునెలలు గడిచినా చార్జిషీట్‌ దాఖలు చేయలేదు. ఈ క్రమంలో నిట్‌ డైరెక్టర్‌ సస్పెన్షన్‌ ఎత్తి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తొలుత ద్విసభ్య కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సు మేరకు డైరెక్టర్‌ సస్పెండ్‌ను మరో మూడు నెలలపాటు పొడిగించారు. అప్పటికీ సీబీఐ చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో నిబంధనల మేరకు డైరెక్టర్‌ సస్పెన్షన్‌ను కేంద్ర మానవ వనరుల శాఖ ఎత్తివేసింది. అయితే ఏకస భ్య కమిటీ నివేదిక ఆధారంగా డైరెక్టర్‌ పదవి నుంచి డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావును తొలగిస్తున్నట్టు ఒక్కరోజు వ్యవధిలోనే మరో సర్క్యులర్‌ జారీచేసింది. జాతీయ దృక్పథానికి అనుగుణంగా నిట్‌ నిర్వహణలో డైరెక్టర్‌ విఫలమయ్యారంటూ ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఇచ్చిందని సదరు ఉత్తర్వుల్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేర్కొంది. దీనిపై సూర్యప్రకాశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. కమి టీ ఏకపక్షంగా వ్యవహరించిందంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. డైరెక్టర్‌ తొలగింపు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. నెలన్నర రోజులపాటు స్టే కొనసాగింది. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు కేంద్ర మా నవ వనరుల శాఖ మరో ఉత ్తర్వు జారీ చేసింది. నిట్‌ డైరెక్టర్‌తో కుదుర్చుకున్న ఐదేళ్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్న ట్టు అందులో పేర్కొంది. డైరెక్టర్‌ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నా మూడు నెలల ముందుగా కేంద్ర మానవ వనరులశాఖకు తెలపాలి. కేంద్ర మానవ వనరులశాఖ డైరెక్టర్‌ను తొలగించాలనుకున్నా మూడు నెలలు ముందుగానే తెలపాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకు మూడు నెలల వేతనాన్ని అదనంగా చెల్లించి డైరెక్టర్‌ను పదవి నుం చి తొలగిస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. దాంతో హైకోర్టు స్టేను ఎత్తివేసి, మూడు నెలల వేతనాన్ని తక్షణమే చెల్లించాలని ఏపీ నిట్‌కు ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా డైరెక్టర్‌గా వ్యవహరించిన డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావును పూర్తిగా తొలగించినట్టయింది.

పదవుల భర్తీ ఎప్పుడు?

ఏపీ నిట్‌ డైరెక్టర్‌ తొలగింపు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు నిట్‌ ఇమేజ్‌ను ఒకింత దిగజార్చాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని అధిగమించాలంటే కేంద్రం సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కీలక పదవులన్నీ ఇన్‌చార్జ్‌ల చేతుల్లోనే ఉన్నా యి. ముఖ్యంగా డైరెక్టర్‌, రిజిస్ర్టార్‌ పదవులను తక్షణమే భర్తీ చేయకపోతే ఇప్పటివరకు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఏపీ నిట్‌ మరింత మసకబారే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత క్యాంపస్‌ ఏర్పాటు చేసుకోవడంతో పాటు, ఫలితాల సాధనలోనూ ఏపీ నిట్‌ ఒక స్థాయికి చేరింది. విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ కల్పనలోనూ మంచి రికార్డులను సొంతం చేసుకుంది. కానీ.. ఈ ఏడాది విద్యార్థుల చేరిక తగ్గింది. మొత్తం 750 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందాల్సి ఉండగా.. పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదు. గతంలో మాదిరిగా మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఏపీ నిట్‌లో చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఈ ఏడా ది ప్లేస్‌మెంట్‌లోనూ ఇటువంటి ప్రభావం ఉంటే అంతిమంగా విద్యార్థులకు నష్టం వాటిల్లనుంది. మరోవైపు ఏపీ నిట్‌ పురోగతి కోసం గతంలో ప్రణాళికలు రూపొందించారు.. అవన్నీ నెరవేరాలంటే డైరెక్టర్‌ పదవిని తక్షణమే భర్తీ చేయాలి. కొత్తగా ఏర్పడిన నిట్‌లకు విద్యార్థుల సంఖ్య 120 మాత్రమే ఉంటోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకపడిన విద్యార్థులకు 10 శాతం కోటా అమలు చేయడంతో కాస్త సీట్లు పెరిగాయి. అయితే ఏపీ నిట్‌లో ప్రారంభం నుంచే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. ఇప్పుడు ఏకంగా 750 మం ది విద్యార్థులకు ఆడ్మిషన్‌లు కల్పించాలి. వారందరికీ వసతులు కల్పించాలి. అందుకు తగ్గట్టుగా కాంట్రాక్ట్‌ సిబ్బందిని నియమించాలి. రెగ్యులర్‌ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ చూపాలి. అధ్యయన, పరిశోధనల్లో ఏపీ నిట్‌ ముందడుగు వేసేలా చర్యలు చేపట్టాలి. ఇవన్నీ డైరెక్టర్‌ దగ్గరుండి నిర్వహించే బాధ్యతలు. ప్రస్తుతం నాగ్‌పూర్‌ నిట్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్‌ డైరెక్టర్‌ను నియమించేలా కేంద్రం చర్యలు తీసుకోనట్టయితే ఆ ప్రభావం ఏపీ నిట్‌ ఇమేజ్‌పై పడనుంది. దీంతోపాటు ఏపీ నిట్‌ రిజిస్ర్టార్‌ నియామకానికి చర్యలు చేపట్టినీ ఇప్పటికీ భర్తీ చేయలేదు. నాలుగేళ్లుగా ఇన్‌చార్జ్‌ రిజిస్ర్టార్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిట్‌ పాలనలో కీలకమైన డైరెక్టర్‌, రిజిస్ర్టార్‌ పదవుల భర్తీకి కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-12-16T00:09:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising