ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

36 గంటల ఇంటి దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే నిమ్మల

ABN, First Publish Date - 2022-03-02T17:21:24+05:30

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు స్వాధీనం చెయ్యాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 36 గంటల ఇంటి దీక్ష చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో  టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 36 గంటల ఇంటి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 90 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేకపోతోందని విమర్శించారు. రంగుల మీద ఉన్న మమకారం పేదల ఇళ్ళు పూర్తి చేయడంపై జగన్‌కు లేదని మండిపడ్డారు. జగన్ నాడు పాదయాత్రలో టిడ్కో ఇళ్ళు ఉచితమని చెప్పారని... నేడు బలవంతంగా బ్యాంకు ఋణాల పేరు చెప్పి ప్లాట్స్ అమ్ముకొంటున్నారని ఆయన ఆరోపించారు. జగన్‌కు రంగుల పిచ్చి ఉంటే తాడేపల్లి రాజప్రాసాదానికి, ఇడుపులపాయ ఎస్టేట్‌కి, లోటస్ పాండ్‌కు, బెంగుళూరు ప్యాలెస్‌కు రంగులు వేసుకోవాలని హితవుపలికారు. పేదల ఇళ్లపై రంగులు వేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఒక్క ఇటుక, ఐరెన్, సిమెంట్ కూడా పెట్టని జగన్‌కు చంద్రబాబు కట్టిన ఇళ్లకు పార్టీ రంగులు మాత్రం కావాలా? అంటూ ఎమ్మెల్యే రామానాయుడు నిలదీశారు. 

Updated Date - 2022-03-02T17:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising