ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బురద నీరే శరణ్యం

ABN, First Publish Date - 2022-01-22T05:50:42+05:30

ఫిల్టర్‌ కాని బురదనీరే తమకు శరణ్యమైందని పెదకాపవరం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ మంచినీటి చెరువులో నీరు నేరుగా సంపులోకి తోడి ఆ నీటిని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.

చెరువు నీటిని నేరుగా సంపులోకి తోడుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిల్టర్‌ కాని చెరువు నీరు నేరుగా పంపిణీ 

పెదకాపవరం వాసులకు తప్పని ఇబ్బందులు 

ఆకివీడురూరల్‌ జనవరి 21 : ఫిల్టర్‌ కాని బురదనీరే తమకు శరణ్యమైందని పెదకాపవరం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ మంచినీటి చెరువులో నీరు నేరుగా సంపులోకి తోడి ఆ నీటిని ప్రజలకు  పంపిణీ చేస్తున్నారు. దీంతో నీరు బురదగా ఉండడంతో స్నానాలు చేసేందుకు కూడా పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలతో మంచినీటి చెరువును అభివృద్ధి చేసి, ప్రజలకు మాత్రం రక్షిత  మంచినీరు అందించ డంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ నీటిని తాగలేక  అనారోగ్యం పాలవుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. పశువులు సైతం నీటిని తాగడం లేదని వాపోయారు. ఫిల్టర్‌బెడ్‌లకు మరమ్మతులు చేయడం లేదన పసర్లు తేలి ఉన్నాయని అధికారులుకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

చెరువునీరు కుళాయిల ద్వారా పంపిణీ.. 

మంచినీటి చెరువు నీటిని సంపులోకి తోడి, ఆ నీటినే నేరుగా కుళాయిల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఫిల్టర్‌బెడ్‌ల ద్వారా ఫిల్టర్‌కాని నీరు కుళాయిలు ద్వారా రావడం వల్ల స్నానం చేయడానికి కూడా పనికి రావడం లేదు. గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. అనారోగ్యాల బారిన పడుతున్నాం.

    – గుడిసే శివరామప్రసాద్‌, పెదకాపవరం



Updated Date - 2022-01-22T05:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising