ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్వాకు వైరస్‌ భయం

ABN, First Publish Date - 2022-09-16T05:36:29+05:30

భారీ వర్షాలతో ఏ నిమిషం ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాలతో ఉక్కిరిబిక్కిరి.. 

చెరువుల్లో చనిపోతున్న రొయ్యలు

కలిదిండి, సెప్టెంబరు 15 : భారీ వర్షాలతో    ఏ నిమిషం ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్ష లాది రూపాయల పెట్టుబడి పెట్టడంతో ప్రతి కూల వాతావరణం నుంచి బయటపడాలని రేయింబవళ్లు చెరువుల వద్దే కాపలా ఉంటు న్నారు. వానా కాలంలో వాతావరణం ప్రభావం అధికంగా ఉంటుంది. వర్షాల వల్ల వాతావర ణంలో ఉష్ణోగ్రతలు పడిపోవటంతో చెరువుల్లో ఆక్సిజన్‌ స్థాయి ఒక్కసారిగా పడిపోతున్నాయి.  ఓ వైపు పీహెచ్‌ స్థాయి తగ్గి రొయ్యలు తీవ్ర ఒత్తిడికి గురై బలహీనం కావడంతో వాటిపై వైరస్‌ బ్యాక్టీరియా ప్రభావం పెరుగుతోంది. దీంతో రొయ్యలు వ్యాధుల బారినపడి చనిపోతున్నాయి. 

అమోనియా నైట్రేట్‌లు సాధారణ స్థాయిలో కాకుండా హెచ్చు తగ్గులు ఏర్పడి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయి. దీంతో ఆక్వా రైతులు నష్టపోతున్నారు. చెరువులో రొయ్య పిల్లలను తక్కువ సంఖ్యలో వేసుకోవాలి. ప్రతీ 50 వేల పిల్ల రొయ్యకు ఒక ఏరియేటర్‌ను తిరిగేలా చూసుకోవాలి. వర్షాకాలంలో సాయంత్రం ఏడు గంటల నుంచి ఏరియేటర్లను తిప్పుతుంటే కొంత వరకు రొయ్యలు ఒత్తిడికి గురి కావు. వాడే మేత 35 శాతం తగ్గించి వేసుకుంటే కొంత మేలు జరుగుతుంది. వర్షాకాలంలో వైరస్‌ ఎక్కువగా ఉంటుంది. భూమిలో ఉండే వైరస్‌ తేమగా ఉంటే వాతావరణంలో ఎక్కువగా విజృంభించి రొయ్యల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. ఏ చెరువైనా వైరస్‌ వ్యాధికి గురైతే తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మత్స్యశాఖాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు.

రైతుల ఆవేదన

‘వానాకాలంలో రొయ్యలపై వాతావరణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నీటి నాణ్యత పరీక్షలకు ప్రభుత్వం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే రైతులకు మంచి ఫలితాలు అందుతాయి’  అని ఆక్వా రైతు పోకల శ్రీనుబాబు చెప్పారు. ‘వర్షా కాలంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో చెరువుల్లో నిత్యం మందులు చలుతున్నాం. నిత్యం నీటి పరీక్షలు చేయించుకుంటూ రొయ్యలు ఒత్తిడికి గురికాకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ చెరువుల వద్దే కాపలా ఉంటున్నాం’ అని రైతు డి.సుబ్బారావు చెప్పుకొచ్చారు. 


Updated Date - 2022-09-16T05:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising