అన్నసమారాధనలు
ABN, First Publish Date - 2022-09-18T05:32:13+05:30
పాలకోడేరు గ్రామం ప్రధా న కూడలి రావిచెట్టు సెంటర్ వద్ద వరసిద్ధి వినాయక వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం అన్నసమారాధన నిర్వహించారు.
పాలకోడేరు/కాళ్ల/పెనుగొండ/యలమంచిలి, సెప్టెంబరు 17 : పాలకోడేరు గ్రామం ప్రధా న కూడలి రావిచెట్టు సెంటర్ వద్ద వరసిద్ధి వినాయక వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం అన్నసమారాధన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్తులతో పాటు, పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా కాళ్ళ గ్రామంలో అభయాంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం అన్నసమారాధన నిర్వహించారు. తొలుత స్వామివాకి నైవేద్యం సమర్పించి అన్నసమారాధన నిర్వహించారు. కమిటీ సభ్యులు, పెద్దలు, యువత పాల్గొన్నారు. పెనుగొండ మండలం చెరుకువాడలో చిట్టూరి వారి సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా అన్నసమారాధన నిర్వహిం చారు. యలమంచిలి హైస్కూల్ ఆవరణలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడు వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. చేగొండి బాబ్జి, జగన్, సునీల్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Updated Date - 2022-09-18T05:32:13+05:30 IST