సైనికుల త్యాగాలు మరువలేనివి
ABN, First Publish Date - 2022-12-16T23:30:30+05:30
సైనికుల త్యాగాలు మరువలేని వని పలువురు వక్తలు అన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 16: సైనికుల త్యాగాలు మరువలేని వని పలువురు వక్తలు అన్నారు. తాడేపల్లిగూడెం మాజీ సైనికోద్యోగుల కార్యాలయంలో విజయ్ దివస్ వేడుకలను స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. సంస్థ నిర్వాహకురాలు బోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వ ర్యంలో 1971 యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు ఎం.విశ్వనాథం, కేవీ.సు బ్బారావు, ఎ.కామరాజు, ఎస్వీకే.రెడ్డి, ఎ.నారాయణరావు, ఎన్.వెంకటేశ్వరరావు, సీహెచ్.సుబ్బారావును సత్కరించారు. మాజీ సైనికుల సంఘ అధ్యక్షుడు కె.శివకుమార్, ఉపాధ్యక్షులు రామస్వామి, త్రిమూర్తులు పాల్గొన్నారు.
పాలకొల్లు అర్బన్: సాయుధ దళాల త్యాగాలకు నివాళులర్పించడం అందరి బాధ్యత అని పట్టణ సిఐ షేక్ అఖిల్ జామా అన్నారు. విజయ్ దివ స్ సందర్భంగా మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1971లో పాకిస్తాన్‌పై భారత సైనికుల చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకునే రోజు డిసెంబరు 16 అన్నారు. అనంతరం భార త మాతకు వందనం చేసి వీర సైనికులకు ఘన నివాళులర్పించారు. హెచ్ ఎం భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:30:31+05:30 IST