ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ నాసిరకం బ్యాగులే

ABN, First Publish Date - 2022-07-06T05:37:56+05:30

విద్యాకానుకలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విద్యార్దులకు పంపిణీ చేసిన బ్యాగులు నాసిరకంగా ఉన్నట్టు పలువురు తల్లితండ్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 5 : విద్యాకానుకలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విద్యార్దులకు పంపిణీ చేసిన బ్యాగులు నాసిరకంగా ఉన్నట్టు పలువురు తల్లితండ్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందింది. జిల్లాలో మొత్తం 3,35,417 మంది బాల బాలికలకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ముఖ్యంగా గతేడాది పంపిణీ చేసిన బ్యాగుల సైజులతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చిన్నవిగా ఉన్నాయని, పుస్తకాలన్నీ బ్యాగులో సరిపోయేలా అవసరమైనంత స్థలం లేదని చెబుతున్నారు. బ్యాగుల ఎత్తు, వెడల్పు తగ్గాయంటున్నారు. కొద్ది రోజుల క్రితం జిల్లాలోని కొన్ని మండలాల స్కూల్‌ కాంప్లెక్స్‌లకు సరఫరా అయిన బ్యాగుల నాణ్యతపై సందేహాలు రావడంతో, తనిఖీ నిమిత్తం కొన్ని బ్యాగులను సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయా నికి పంపారు. పాఠశాలలకు వాటిని సరఫరా చేయకుండా నిలిపి వేసిన అధికారులు, పైనుంచి మౌఖిక ఆదేశాలతో తిరిగి వాటినే పంపిణీ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడానికి ఇష్టపడటం లేదు. నాణ్యమైన బ్యాగులనే విద్యార్థులకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు బ్యాగుల సరఫరా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించినట్టు తెలి సింది. కాగా నోట్‌బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులు, బెల్టులు మిన హా విద్యాకానుక కిట్లలో ఇవ్వాల్సిన వస్తువుల్లో సగం వరకు మాత్రమే జిల్లాకు మంగళవారం వరకు సరఫరా అయ్యాయి.


Updated Date - 2022-07-06T05:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising