ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తనిఖీలతో వాహనదారుల ఇక్కట్లు

ABN, First Publish Date - 2022-08-08T06:35:13+05:30

పెదవేగి, ఆగస్టు 7: తనిఖీల పేరుతో వాహనదారులను గంటల తరబడి నిలిపి వేయడం ఎంతవరకు సబబని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు, ప్రభాకర్‌ మధ్య వాగ్వాదం జరుగుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులపై  చింతమనేని ఆగ్రహం


పెదవేగి, ఆగస్టు 7: తనిఖీల పేరుతో వాహనదారులను గంటల తరబడి నిలిపి వేయడం ఎంతవరకు సబబని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి రహదారిపై పెదవేగి మండలం వంగూరు సమీపంలో రంగరాయ వేర్‌ హౌసింగ్‌ గోదాము వద్ద ఆదివారం మధ్యాహ్నం పెదవేగి ఎస్‌ఐ వైవీవీ సత్యనారాయణ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో కొన్ని వాహనాలను సరైన పత్రాలు లేవని రంగరాయ గోదాములో పెట్టించారు. వర్షం పడుతుండడం, వెళ్ళడానికి ఎలాంటి వాహన సౌకర్యం లేకపోవడంతో వాహనాదారుల ఇక్కట్లు పడ్డారు. వాహనదారులు ఈ విషయాన్ని అటుగా వెళ్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎస్‌ఐని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పెద్దనేరమైతేనే వాహనాలను సీజ్‌ చేస్తారు తప్ప ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలకు కాదని, పోలీసులు వాడే వాహనాలకు ఎంత మంది అన్ని ధ్రువీకరణ పత్రాలతో వాహనాలను నడుపుతున్నారని ప్రభాకర్‌ ప్రశ్నించారు. తానేమీ కక్షతో వాహనాల తనిఖీలు చేయడంలేదని, విధి నిర్వహణలో భాగంగా తనిఖీ చేస్తున్నామని పెదవేగి ఎస్‌ఐ వివరించారు. అనంతరం చింతమ నేని పోలీస్‌ ఉన్నతాధికారులకు  ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో వారు ఎస్‌ఐతో మాట్లాడతామని చెప్పారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించి ఎస్‌ఐ వదిలివేశారు. ప్రభాకర్‌ వెంట టీడీపీ పెదవేగి మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-08T06:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising