రేపు దళిత సమరభేరి విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-12-16T00:30:14+05:30
ఏలూ రులో ఈనెల 17న జరిగే దళిత సమరభేరీ ర్యాలీని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు, పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి పాతూరి అంబేడ్కర్ పిలుపునిచ్చారు.
జంగారెడ్డిగూడెం, డిసెం బరు 15 : ఏలూ రులో ఈనెల 17న జరిగే దళిత సమరభేరీ ర్యాలీని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు, పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి పాతూరి అంబేడ్కర్ పిలుపునిచ్చారు. గురువారం టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఏలూరు ఫైర్‌స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నుంచి పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాళ్ల సుజీవరావు ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, తూటికుంట రాము, పెనుమర్తి రామ్‌కుమార్, నంబూరి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:30:15+05:30 IST