ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకున్న స్థానికులు

ABN, First Publish Date - 2022-08-10T05:18:01+05:30

తోటపల్లిలో జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలను మంగళవారం చిన్నాగిరిపల్లి శివారు గొల్లగూడెం, సర్నాలగొల్లగూడెం, ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు.

తోటపల్లిలో గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకున్న స్థానికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధితో పాటు పొలాలు నాశనం అవుతున్నాయంటూ ఆందోళన


ఆగిరిపల్లి, ఆగస్టు 9 : తోటపల్లిలో జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలను  మంగళవారం చిన్నాగిరిపల్లి శివారు గొల్లగూడెం, సర్నాలగొల్లగూడెం, ఎస్సీ కాలనీ వాసులు  అడ్డుకున్నారు. గ్రామంలో అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రెండు ఎకరాల బి–ఫారం భూమిని కొనుగోలు చేసి అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారన్నారు. చింతగట్టు, తనగళ్లబాట గట్లను అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారని ఆరోపించారు. రాత్రింబవళ్లు ఎనిమిది ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేసి వేలాది లారీల్లో గ్రావెల్‌ను తరలిస్తున్నారని వాపోయారు. దీనివల్ల తమ పశువులకు ఆవాసంగా ఉన్న  కొండ పరివాహక ప్రాంతం కలుషితమై జీవనాధారం కోల్పోతున్నామని, లారీల సంచారంతో పంట భూ ములు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాలు కొనసా గించేది లేదని వాహనాలను  అడ్డగించారు. తవ్వకాలు పూర్తిగా నిలపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో చిన్నాగిరిపల్లి ఎంపీటీసీ సభ్యులు సర్నాల జయలక్ష్మి, శ్రీనివాసరావు, బగుడు సోమయ్య, సోలా ఆంజనేయులు, జువ్వనబోయిన ఆంజనేయులు, జంగం అంజయ్య, తోట వీరాస్వామి, చిన్ని వెంకటేశ్వరరావు, జంగం సురేష్‌ పాల్గొన్నారు. అయితే గ్రావెల్‌ తవ్వకాలకు పూర్తిగా అనుమతులు ఉన్నాయని నూజివీడు టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్థానికులను రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారని క్వారీ యజమాని లావు  ప్రసాదరావు వివరణ ఇచ్చారు.

Updated Date - 2022-08-10T05:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising