నేడు తెలుగు యువత శిక్షణ సాధికారత తరగతులు ప్రారంభం
ABN, First Publish Date - 2022-06-24T04:40:27+05:30
పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి చందు పిలుపు మేరకు తెలుగు యువత శిక్షణ సాధికారత తరగతులను ఈ రోజు తెలుగుదేశం పార్టీ..
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగు యువత శిక్షణ - సాధికారత తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి చందు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ తరగతులలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు కోనేటి చంటి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నత్తా నాగేంద్ర, చింతలపూడి నియోజకవర్గ నాయకుడు కోండ్రు నాగరాజు, పట్టణ ఉపాధ్యక్షులు మల్లిపూడి, నవీన్, చిలంకూరి, బాబీ, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు శీలామంతుల రాంబాబు, తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-24T04:40:27+05:30 IST