ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ సానుభూతిపరుడనని వేధింపులు

ABN, First Publish Date - 2022-09-26T06:18:24+05:30

టీడీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ను కావడం వల్ల పంచాయతీ కార్యదర్శితో కుమ్మక్కై వైసీపీ నాయకులు తనను వేధిస్తున్నారని కొత్త ఈదర గ్రామ సర్పంచ్‌ బెక్కం రాజగోపాలరావు ఆరోపించారు.

మీడియాతో మాట్లాడుతున్న సర్పంచ్‌ రాజగోపాలరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త ఈదర సర్పంచ్‌ ఆరోపణ


ఆగిరిపల్లి, సెప్టెంబరు 25 : టీడీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ను కావడం వల్ల పంచాయతీ కార్యదర్శితో కుమ్మక్కై వైసీపీ నాయకులు తనను వేధిస్తున్నారని కొత్త ఈదర గ్రామ సర్పంచ్‌ బెక్కం రాజగోపాలరావు ఆరోపించారు. ఆదివారం పంచాయతీ సభ్యులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఎన్నికైన నాటి నుంచి కార్యదర్శి తనకు సహకరించడం లేదని,  పంచాయతీ రికార్డులు కూడా తనపై రెండు పర్యాయాలు ఓటమి చెందిన వైసీపీ నాయకుడి ఇంటి వద్ద పెట్టి  ఏపని చేయాలన్నా ఆయన ఆదేశాల మేరకే చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఇటీవల ఆ నాయకుడు ఎన్నికల్లో గెలిచేందుకు తన సొంత భూమిని సచివాలయం, ఆర్బీకే వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణాలకు దానం చేస్తున్నట్టు అఫిడవిట్‌ ఇచ్చి ఆ స్థలంలో బేస్‌మెంట్‌ వేసిన తదుపరి స్థలం ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. అయితే తాము స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చామని దీంతో నిర్మాణం జరగని సచివాలయ పనుల్లో తాను లక్షలు దుర్వినియోగం చేసినట్టు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కార్యదర్శి తీరుపై డీపీవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానన్నారు.  దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని చెప్పారు. 

Updated Date - 2022-09-26T06:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising