ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారిని గెలిపించినందుకు రైతాంగానికి శిక్షా?: Nimmala

ABN, First Publish Date - 2022-02-02T16:57:27+05:30

ఉభయగోదావరి జిల్లాల రైతుల ధాన్యం బకాయిలు విడుదల చేయాలని సీయం జగన్‌కు రెండు జిల్లాలకు చెందిన పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల రైతుల ధాన్యం బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్‌కు రెండు జిల్లాలకు చెందిన పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖ రాశారు. బుధవారం ఉదయం ఏలూరులో ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ ధాన్యం అమ్మి 3, 4 నెలలు గడుస్తున్నా నేటికి  రైతులకు సొమ్ము  చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే, గత పంట పెట్టుబడికి వడ్డీ ఎవరు కడతారు? రెండో పంట దాళ్వాకు పెట్టుబడి ఎలా తేవాలి? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు వివరాలను పారదర్శకంగా చూపించవలసిన ప్రభుత్వం ఆన్‌లైన్ నుండి ఎందుకు వాటిని తొలగించిందని నిలదీశారు. గోదావరి జిల్లాల రైతులు 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలను, 5 మంది వైసీపీ పార్లమెంట్ సభ్యులను గెలిపించినందుకు రైతాంగానికి శిక్ష విధిస్తారా? అని మండిపడ్డారు. గోదావరి జిల్లాల పట్ల, రైతాంగం పట్ల నిర్లక్ష్యం, కక్షను ముఖ్యమంత్రి విడనాడాలని ఎమ్మెల్యేలు హితవుపలికారు. 

Updated Date - 2022-02-02T16:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising