ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదేమి పాలన బాబాయ్‌

ABN, First Publish Date - 2022-12-16T00:19:52+05:30

ఇదేమి పాలన బాబోయ్‌ అంటూ వైసీపీ తీరుపై ఎమ్మెల్యే మంతెన రామరాజు మండిపడ్డారు.

కలిగొట్లలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మంతెన రామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండి, డిసెంబరు 15: ఇదేమి పాలన బాబోయ్‌ అంటూ వైసీపీ తీరుపై ఎమ్మెల్యే మంతెన రామరాజు మండిపడ్డారు. కలిగొట్ల, ఆరేడు గ్రామాలలో గురువారం ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు, పెద్దల నుంచి వైసీపీ పాలన తీరు గురించి ఆరా తీశారు. వద్దు వద్దు ఈ పాలన అంటూ వారు బదులిచ్చారు. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపో యారని ఎమ్మెల్యే అన్నారు. రుద్రరాజు సూర్యనారాయణరాజు, యశోద కృష్ణ, సర్పంచ్‌ ఎంవి సూర్యనారాయణ, కరిమెరక నాగరాజు, పొత్తూరి వెంకటేశ్వర రాజు, గురుగుబిల్లి సత్యనారాయణ, కందుల బలరాం, పాల్గొన్నారు.

పాలకొల్లు అర్బన్‌: పట్టణంలోని 22 వార్డులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రభుత్వంలో అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను నమో దు చేసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పెచ్చెట్టి బాబు, జీవీ, వట్టం గణేష్‌, మండాది అవినాష్‌, బీరక ప్రసాద్‌, రాము, మహిళలు పాల్గొన్నారు.

ఆకివీడు రూరల్‌: వైసీపీ ప్రభుత్వం కన్ను పడితే ఆ రంగం నాశనం కావాల్సిందేనని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంట్లా గణపతి అన్నారు. చిన కాపవరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. ఆక్వా రంగానికి సబ్సిడీ ఎత్తివేసి, ఆక్వాజోన్‌, ఎకరాలు పరి మితులు తీసుకురావడంలో ఆంతర్య మేమిటన్నారు. బొల్లా వెంకట్రావు, మర్రివాడ వెంకట్రావు, తోట ఏడుకొండలు, మర్రివాడ శ్రీనివాసరావు, చెన్నంశెట్టి శ్రీనివాసరావు, గంధం ఉమా, ఎండి అజమాల్‌ పాల్గొన్నారు. సిద్ధాపురం లో భూపతిరాజు తిమ్మరాజు, కిమిడినాగరాజు, బత్తుల రవి పాల్గొన్నారు.

వీరవాసరం: అభివృద్ధిలో వీరవాసరం వెనకబడే ఉందని టీడీపీ నాయకులు అన్నారు. తాగునీరు, మురుగునీరు పారుదలకు డ్రయినేజీ సదుపాయాలు లేక గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీరవాసరంలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ వీధుల్లో టీడీపీ నాయకులు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, కోళ్ళ నాగేశ్వరరావు, మెంటే పార్థసారథి, కొల్లేపర శ్రీనివాసరావు, కముజు హరిబాబు, రాయపల్లి వెంకట్‌, చింతా కనక కయ్య, కడలి నెహ్రు, వీరవల్లి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising