వరద బాధితులకు టీడీపీ సాయం
ABN, First Publish Date - 2022-08-05T05:13:41+05:30
ఆపదలో ఉన్నవారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.
భీమవరం అర్బన్, ఆగస్టు 4: ఆపదలో ఉన్నవారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. టీడీపీ నియోజవర్గ కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం, బట్టలు, దుప్పట్లు, పశుగ్రాసం గురువారం పంపించారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గోదావరి వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధితులకు సహాయం అందించాలని సూచించారన్నారు. 600కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులతో పాటు పశువులకు ఎండు గడ్డి, పచ్చగడ్డి సరఫరా చేసినట్లు తెలిపారు. విరాళాలు అందించిన టీడీపీ నాయకులను దాతలను అభింనందించారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ వైసీపీ పాలనలో బాధితులకు సహాయం అందక పోవడంతో టీడీపీ తరపున సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఆచంట, పాలకొల్లు నియోజవర్గాలలోని ముంపు ప్రాంతాల భాధితులకు సరుకులు అందించనున్నట్లు తెలిపారు. పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృద్వీశంకర్, కొల్లిపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, సయ్యద్ నసీమబేగం, మెంటే గోపి, ఎద్దు ఏసుపాదం, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T05:13:41+05:30 IST