ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-01-24T06:03:44+05:30

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

తూర్పు చోడవరం గౌవర సభలో మాట్లాడుతున్న ముప్పిడి వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లజర్ల, జనవరి 23: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తూర్పు చోడవరంలో ఆదివారం గౌరవ సభ నిర్వహించారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేయవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని వారితో శాంతియుత చర్చలు జరిపి సమర్థవంతమైన పాలన అందించాలన్నారు. గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలపై స్థానిక నాయకులు పోరాడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షేక్‌ మీరా సాహెబ్‌, ఉపాధ్యక్షుడు గుదే సుబ్బారావు, కెంగం శ్రీను, సర్పంచ్‌ సంఖవరపు వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్‌ ఉండవల్లి గోపాలకృష్ణ, కూచిపూడి ఉదయ భాస్కర్‌, జాలపర్తి భార్గవ్‌, ఉప్పు నరేష్‌, సవలం రామకృష్ణ పాల్గొన్నారు.


పోరాటానికి ఫ్యాప్టో సిద్ధం


కామవరపుకోట: పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ సమస్యలపై పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేసే పోరాటానికి తామూ సిద్ధంగా ఉన్నట్టు కామవరపుకోట మండల ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు. ఆదివారం వారు మాట్లాడుతూ 25న ఏలూరులో కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో తాము పాల్గొంటామన్నారు. 26న స్థానికంగా అంబేడ్కర్‌ విగ్రహానికి తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాన్ని అందజేస్తామన్నారు. 27, 28, 29, 30 తేదీల్లో ఏలూరులో జరిగే రిలే నిరాహార దీక్షల్లో తమ సభ్యులు పాల్గొంటారని ఫ్యాప్టో ప్రతినిధులు ప్రకటించారు.

Updated Date - 2022-01-24T06:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising