ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్‌ ఛార్జీల పెంపుపై టీడీపీ నిరసన

ABN, First Publish Date - 2022-07-04T06:57:03+05:30

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్‌ ఛార్జీలపై టీడీపీ నాయకులు భగ్గు మన్నారు.

చింతలపూడి కొత్తబస్టాండ్‌ వద్ద టీడీపీ నాయకులు నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్‌ ఛార్జీలపై  టీడీపీ నాయకులు భగ్గు మన్నారు.  ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆధ్వర్యంలో  పాతబస్టాండ్‌ సెంటర్‌లో ఆదివారం నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బాదుడు కార్యక్రమం కొనసాగుతోందని ఫలితంగా పేదల జీవనం కష్టమవుతుందని, ఛార్జీలు తక్షణమే తగ్గించాలం టూ నినాదాలు చేశారు. చంటి మాట్లాడుతూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన జగన్‌ ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తున్నారన్నారు.    బస్సులో  ప్రయాణికులతో చార్జీల పెంపుతో వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.  

కామవరపుకోట: ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచి భారం మోపడం తగదని  టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ అన్నారు. స్థానిక  పార్టీ కార్యాలయంలో ఆదివారం బస్‌ చార్జీల పెంపుపై నిరసన తెలిపారు.  పెంచిన బస్సు చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఘంటా సుధీర్‌బాబు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం:   బస్సు చార్జీలు పెంచి పేదలపై వైసీపీ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు భారం మోపిందని  టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ  ధ్వజమెత్తారు.  జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆదివారం బస్సు ప్రయాణీకులకు, ప్రజలకు చార్జీల మోతపై వివరించారు.   సీనియర్‌ నాయకుడు పరిమి సత్తిపండు,  పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌  తదితరులు పాల్గొన్నారు. 

చింతలపూడి: ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచి  ప్రజల నడ్డి విరుస్తోం దని టీడీపీ మండల  అధ్యక్షుడు మాటూరి వెంకట్రామయ్య అన్నారు. చింతలపూడి కొత్తబస్టాండ్‌ వద్ద ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించారు. ఆర్టీసి బస్సుల్లో ప్రయాణీకులకు ప్రభుత్వ బాదుడుపై వివరించారు. పెంచిన చార్జీలు, పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు.  కార్యదర్శి దేవ, కొత్తపూడి శేషగిరిరావు, కె.రాజారెడ్డి, సయ్యద్‌ బాబు, సుబ్బారావు, ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T06:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising