జగన్‌ది రివర్స్ పాలన
ABN, First Publish Date - 2022-04-06T05:30:00+05:30
తమ పార్టీ అధికారంలోకి రాగానే గృహావస రాలకు 200 యునిట్లలోపు విద్యుత్ ఉచితంగా ఇస్తామని, కరెంట్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట తప్పి రివర్స్ పాలన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
కొవ్వొత్తులు, విసనకర్రలతో టీడీపీ నాయకుల నిరసన
దెందులూరు, ఏప్రిల్ 6: తమ పార్టీ అధికారంలోకి రాగానే గృహావస రాలకు 200 యునిట్లలోపు విద్యుత్ ఉచితంగా ఇస్తామని, కరెంట్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట తప్పి రివర్స్ పాలన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. బుధవారం దోసపాడు, పోతునూరు గ్రామాల్లో టీడీపీ గ్రామ అధ్యక్షుడు కోనేరు బాబి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నున్న లక్ష్మణరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆ రెండు గ్రామాల్లో కొవ్వొత్తులు, విసనకర్రలు పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాగంటి నారాయణప్రసాద్, మాజీ వైస్ ఎంపీపీ మోతుకూరి నాని, తెలుగు యువత అధ్యక్షుడు జక్కుల ఆశబాబు, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు బోడేటి మోహన్, రైతు సంఘం మండల అధ్యక్షుడు గండి రాజా, మాజీ సర్పంచ్ జక్కుల దాసు, మాజీ ఎంపీటీసీ తలారి ధన్యకుమార్ పాల్గొన్నారు.
అంధకారంలోకి రాష్ట్రం : చింతమనేని
పెదపాడు, ఏప్రిల్ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారాన్ని మోపేలా విద్యుత్తు, నిత్యావసర సరుకుల ధరలను పెంచిందని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. పెంచిన విద్యుత్, నిత్యవసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఏపూరులో నిరసన తెలిపారు. చింతమనేని మాట్లాడుతూ పెరిగిన విద్యుత్తు ఛార్జీలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, దీనిపై గ్రామ గ్రామాన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాలనను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు లావేటి శ్రీనివాసరావు, పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి గుత్తా అనిల్, పార్టీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు, కరుకోటి మోహన్ పాల్గొన్నారు.
జగన్ దిగితేనే ధరలు తగ్గేది : ముప్పిడి
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 6: విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధర లు దిగిరావాలంటే జగన్ ప్రభుత్వం దిగిపోవాల్సిందేనని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. దొరసానిపాడులో బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే...బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటిం టికి కొవ్వొత్తులతో ర్యాలీగా వెళ్లి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై అవగాహన కల్పించారు. లంకా సత్తిపండు, ఏపూరి దాల య్య, కొయ్యలమూడి సుధారాణి, చినబాబు, మద్దిపాటి రత్నాజీ, కారుమంచి మురళి, ఇందిర. ఆలపాటి నాని, ముప్పిడి సుజాత, కూరాకుల బుజ్జి, బద్రి, రాయపాటి గణేష్, శ్రీను, నరేంద్ర, రమేష్, గిరి, నాదెళ్ల వేణు పాల్గొన్నారు.
Updated Date - 2022-04-06T05:30:00+05:30 IST