ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిరంగ చర్చకు సిద్ధమా ?

ABN, First Publish Date - 2022-07-02T06:39:36+05:30

‘మీ చరిత్ర, చింతమనేని చరిత్ర తెలుసుకునేందుకు బహిరంగ చర్చకు సిద్దమా’ అని దెందులూరు నియోజకవర్గ వైసీపీ నాయకుడు కొఠారు రామచంద్రరావుకు టీడీపీ నియోజకవర్గ నాయకులు సవాల్‌ విసిరారు.

విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ దెందులూరు నియోజకవర్గ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ నేత రామచంద్రరావుకు టీడీపీ నాయకుల సవాల్‌ 

ఏలూరు రూరల్‌, జూలై 1 : ‘మీ చరిత్ర, చింతమనేని చరిత్ర తెలుసుకునేందుకు బహిరంగ చర్చకు సిద్దమా’ అని దెందులూరు నియోజకవర్గ వైసీపీ నాయకుడు కొఠారు రామచంద్రరావుకు టీడీపీ నియోజకవర్గ నాయకులు సవాల్‌ విసిరారు. పార్టీ జిల్లా కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో టీడీపీ పెదవేగి మం డల అధ్యక్షుడు బొప్పన సుధాకర్‌ మాట్లాడుతూ ఇటీవల దెందులూరు నియోజక వర్గ వైసీపీ ప్లీనరీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తిట్టడానికి, ఆయనను టార్గెట్‌ చేయడానికే పెట్టినట్టు ఉందని విమర్శించారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి తండ్రి కొఠారు రామచంద్రరావు చింతమనేని ప్రభాకర్‌ చరిత్రపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ భూములు కాజేసింది వాస్తవం కాదా అని ప్రశ్నిం చారు. అడవిని చదును చేసుకున్న 70 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదా అని ప్రశ్నించారు. ప్లీనరీలో దానధర్మాలు చేసిన వంశమని చెప్పుకున్న రామచంద్రరావు పేదవాడి భూములు లాక్కోవడమే ధానధర్మమా అని మండిప డ్డారు. పెదపాడులో ఎకరానికి 25 వేలు తీసుకుని అక్రమ చెరువులు తవ్విస్తున్నా రని ఆరోపించారు. సమావేశంలో నాయకులు నేతల రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising