ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలను అణచివేసిన వైసీపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-12-07T23:55:23+05:30

వైసీపీ పాలనలో బీసీలను హతమార్చారని, దాడులు, అరెస్టులు చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఆకివీడులో కొవొత్తులతో టీడీపీ శ్రేణుల నిరసన ప్రదర్శన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, డిసెంబరు 7: వైసీపీ పాలనలో బీసీలను హతమార్చారని, దాడులు, అరెస్టులు చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అణచివేత చర్యలకు పాల్పడిని వారు నేడు బీసీ గర్జన అంటే వారు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్‌, బొల్లా వెంకట్రావు అన్నారు. బీసీలను మోసం చేస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా బుధవారం ప్లకార్డులు, కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. టీడీపీకి బీసీలు అండగా ఉంటారన్నారు. జగన్‌ ప్రభుత్వంలో నలుగురు బీసీలకు సాధారణ పదవులు ఇచ్చి వైసీపీ బీసీల ప్రభుత్వమంటే హాస్యాస్పదం అన్నారు. ఉన్నత పదవులన్నీ జగన్‌ సామాజికవర్గానికి ఇచ్చి నేడు బీసీ జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ కార్పోరేషన్‌ నిధులు విడుదల చేయాలన్నారు. జీవో నెం.217 రద్దుచేసి, కుల వృత్తులను ప్రోత్సహించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ నేతలు బీసీ జపం చేస్తున్నారన్నారు. తుగ్లక్‌ సీఎం వలన పెద్ద పెద్ద పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడంతో మరింత నిరుద్యోత్వం పెరిగిపోతుందన్నారు. ధాన్యం కొనుగోల్లో గందరగోళం పరిస్థితులన్నారు. మూడు రోడ్లు వేయలేని జగన్‌ మూడు రాజధానుల నినాదంతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌దే అన్నారు. నౌకట్ల రామారావు, గంధం ఉమా, భూపతిరాజు తిమ్మరాజు, బొల్లా వీరశ్వేత, శేషుబాబు, కిమిడి నాగరాజు, పెద్దిరాజు, విశ్వేశ్వరరావు, బొర్రా రాంబాబు, మంగరాజు నాగరాజు, మీగడ నాగరాజు, జన్ను గోపి, కొల్లి వెంకన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising