ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో అభివృద్ధి ఏదీ..?

ABN, First Publish Date - 2022-12-07T23:52:24+05:30

వైసీపీ పాలనలో ఎక్కడా అభివృద్ధి జాడలేదు.. కక్షపూరిత పాలన.. ధరల బాదుడు.. ప్రభుత్వాన్ని ఇంకా ఏడాది పాటు భరించాలా? ఇదేం ఖర్మ

పాలకొల్లులో వృద్ధులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నిమ్మల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌ / రూరల్‌, డిసెంబరు 7: వైసీపీ పాలనలో ఎక్కడా అభివృద్ధి జాడలేదు.. కక్షపూరిత పాలన.. ధరల బాదుడు.. ప్రభుత్వాన్ని ఇంకా ఏడాది పాటు భరించాలా? ఇదేం ఖర్మ మనకు అంటూ ప్రజలు వాపోతున్నా రని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టణంలోని 4వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మండ లంలోని వెలివెలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిత్యావసరాల ధరలు పెరుగుదల, పెన్షన్లు నిలిచిపోవడం, ఇండ్ల బిల్లులు కాకపోవడం, రైతులు పండిన పంటను కొనుగోలు చేయడంలో అనేక ఇబ్బం దులు, విద్యుత్‌, రహదారులు పరిస్థితిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట గండేటి వెంకటేశ్వరరావు, పెండ్యాల భవాని, ధనాని శ్రీరామ మూర్తి, నడింపల్లి వీరాంజనేయులు, మణికంఠ, కోటి రాంబాబు, దొమ్మేటి ఏసు, నాయకులు పెద్దింటి శ్రీను, బోడపాటి బుజ్జి తదితరులు ఉన్నారు.

నరసాపురం టౌన్‌: వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో మాత్రం మొదటి స్థానంలో నిలిచిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు ఎద్దేవా చేశా రు. లాకుపేటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం సెంటర్‌లో వారు మాట్లాడుతూ ప్రభుత్వం హామీలతో ప్రజల్ని మభ్యపె డుతుందే తప్ప పనులు జరగడం లేదన్నారు. వేసిన శిలఫలాకాలు ఏడాది గడిచినా పునాదులు దాటడం లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, పాలూరి బాబ్జీ, సంకు భాస్కర్‌, మల్లాడి మూర్తి, షాన్వాజ్‌ఖాన్‌, శశిదేవి, తామరపు వెంకటేశ్వరావు, కె.పద్మ, బర్రె మురళి, కడలి నాగశెట్టి, తుమ్మలపల్లి లక్ష్మినారాయణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising