ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులకు చేయూతనిద్దాం

ABN, First Publish Date - 2022-07-21T05:52:42+05:30

వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలబడాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, జూలై 20: వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలబడాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. గురువారం, శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపధ్యంలో కార్యకర్తలు, నాయకుల అర్భా టాలు చేయవద్దన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజక వర్గ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ మట్లాడారు. చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, దండలు, బొకేలు, శాలువాల బదులు ఆ ఖర్చుతో వరద బాధితులకు సహాయం అందించాలన్నారు.  దుప్పట్లు, పాలు, బియ్యం, నూతన వస్త్రాలు, నిత్యావసరాలు చంద్రబాబు నాయుడు ద్వారా  బాధితులకు అందజేయడానికి ముందుకు రావాలని కోరారు. కర్నేన గౌరునాయుడు, కర్నేన రోజారమణి, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పీతల శ్రీను, పాముల రజనీకుమార్‌ పాల్గొన్నారు.


నరసాపురం టౌన్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నరసాపురం పర్యటన ఏర్పాట్లను పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు పర్యవేక్షించారు. కోతకు గురైన పొన్నపల్లి ఏటిగట్టును చంద్రబాబు పరిశీలించి స్ధానిక మత్స్యకారులతో సమావేశం అవుతారు. దీనికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను పార్టీ శ్రేణులతో సమీక్షించారు. నీట మునిగిన అరుంధతిపేట, లాకుపేటల్లో పర్యటించారు. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ 10వేలు అర్ధిక సాయం అందించాలని  వారు డిమాండ్‌ చేశారు. జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-21T05:52:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising