ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులకు అండగా టీడీపీ నేత బొరగం శ్రీనివాసులు.. బియ్యం పంపిణీ

ABN, First Publish Date - 2022-08-11T00:44:34+05:30

ఇటీవల కురిసిన వర్షాలకు వెలేరుపాడు మండలంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): ఇటీవల కురిసిన వర్షాలకు వెలేరుపాడు మండలంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ (Tdp) అండగా నిలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు నిత్యవసరాలు అందజేస్తున్నారు. NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలేరుపాడు మండలం రేపాకుగోమ్ములో 450 కుటుంబాలకు, మద్దికట్ల 168 కుటుంబాలకు, పాతపుచిరాల 130 కుటుంబాలకు.. నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరవరపు అశోక్, ప్రధాన కార్యదర్శి కట్టం రాంబాబు, నూపా శ్రీరాములు, గొంది. నాగేశ్వరరావు, మోహనరావు, శ్రీను తదితరులు ఉన్నారు.



ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) మాట్లాడుతూ వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ తరుపున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm jagan mohanreddy) ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. వైసీపీ (Ycp) ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అయినా పోలవరం ముంపు బాధితులకు ఆర్&ఆర్ ప్యాకేజీలు ఇవ్వకపోవడం, పునరావాస కాలనీల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయకపోవటం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు మళ్లీ గోదావరి వరద ఉదృతి పెరుగుతుందనీ, అందరూ అప్రమత్తంగా ఉండాలని బొరగం శ్రీనివాసులు సూచించారు. 

Updated Date - 2022-08-11T00:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising