ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనపై తీవ్ర వ్యతిరేకత : ఎమ్మెల్యే మంతెన

ABN, First Publish Date - 2022-08-12T05:30:00+05:30

జగన్‌ మూడేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామ రాజు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉండి /పాలకొల్లుఅర్బన్‌,ఆగస్టు 12: జగన్‌ మూడేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామ రాజు మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని ఉప్పులూరులో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయావీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు జుత్తుగ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మోపిదేవి శ్రీను, ఉపాధ్యక్షుడు గురుగుబిల్లి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షుడు పొత్తూరి వెంకటేశ్వరరాజు, కరిమెరక శ్రీను, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని సంత వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రామరాజు జొన్న పొత్తులు కాల్చి వినియోగదారులకు విక్రయించారు. మటన్‌ వ్యాపారి వద్దకు వెళ్లి రేట్ల వివరాలను అడిగారు. సీఎం జగన్‌ మాటలు నమ్మొద్దని పాలకొల్లు టీడీపీ నేతలు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత 30వ వార్డులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఓటర్ల లిస్టుల పరిశీలన, పార్టీ సభ్యత్వ నమోదును పరిశీలించారు. ప్రజలపై చెత్త, డ్రైనేజీ, మరుగుదొడ్ల, వీధి లైట్ల పన్నులు వేస్తున్నారని పార్టీ పట్టణ అధ్యక్షుడు గండేటి వెంకటేశ్వరరావు విమర్శించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ ధనాని సూర్యప్రకాష్‌, వార్డు అధ్యక్షుడు చిప్పాడ రుష్యేంద్ర కుమార్‌, కార్యదర్శి కడసారపు శ్రీను, నాయకులు బందెల భాస్క రరావు, కవురు ముత్యాలరావు, రామారావు, అన్నవరం, సత్యనారా యణ, వార్డు నేతలు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising