ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T Narasapuram: వరద బాధితులకు అండగా టీడీపీ నేతలు.. నిత్యావసరాల పంపిణీ

ABN, First Publish Date - 2022-08-01T03:19:57+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆదేశాల మేరకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆదేశాల మేరకు గోదావరి (Godavari) వరద బాధితులకు టీ నర్సాపురం మండల టీడీపీ నేతలు (Tdp Leaders) అండగా నిలిచారు.  వరదలతో నిరాశ్రయులైన వేలేరుపాడు మండలం కోయిదా పంచాయతీలోని 575 కుటుంబాలకు 2 లక్షల రూపాయల విలువైన బియ్యం, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే లక్ష్మి ఏజెన్సీస్ ఐటీసీ ప్రైవేట్ డీలర్స్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం తరుపున 85 వేల రూపాయల విలువైన బిస్కెట్లను నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగింది.


ఈ  సందర్బంగా టీ నర్సాపురం మండల సీనియర్ నాయకులు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బొంతు సత్యనారాయణ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం బాధితులను ఆదుకుందని.. ఎప్పుడైనా టీ నర్సాపురం మండలం తరుపున సహాయ సహకారాలు అందించటానికి సిద్దంగా ఉన్నామని ఆయన తెలియజేశారు. 



ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు రామకృష్ణారావు గౌడ్, అమరవరపు అశోక్, ప్రధాన కార్యదర్శులు ఆచంట అనిల్, కట్టం రాంబాబు, టీ నర్సాపురం మండల పార్టీ ఉపాధ్యక్షుడు సిద్దా శ్రీను, వేలేరుపాడు మండల మాజీ జడ్పీటిసి శాఖమూరి సంజీవులు, బీసీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండపల్లి రవి, నూపా శ్రీరాములు, చేదల రాజిరెడ్డి, ముత్యాలరావు, వెన్నెల గోపాలకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-01T03:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising