ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందేళ్ల పాఠశాల పండగ అభినందనీయం

ABN, First Publish Date - 2022-01-09T06:20:08+05:30

విద్యద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని పెద్దలు భావించి వందేళ్ల కిందటే పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీరంగనాథరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా ఎస్‌వీజీ పాఠశాల శత వసంతాల వేడుక
పైలాన్‌ ఆవిష్కరించిన మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, మంత్రి రంగరాజు

పెనుమంట్ర, జనవరి 8 : విద్యద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని పెద్దలు భావించి వందేళ్ల కిందటే పాఠశాలను ఏర్పాటు చేయడం  జరిగిందని  మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు. పెనుమంట్ర మండలం మార్టేరులోని శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల శత వసంతాల వేడుకల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు.దేశవిదేశాల్లో అనేక మంది విద్యార్థులు అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నారని వారి స్ఫూర్తిని నేటి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో శత వసంతాల వేడుకలు నిర్వహించడం అభి నందనీయమన్నారు. పాఠశాలను జూనియర్‌ కళాశాలగా అప్‌ గ్రేడ్‌ చేసేందుకు కృషిచేస్తానన్నారు.మండలి చైర్మన్‌ కొయ్యే మోషన్‌ రాజు మాట్లాడుతూ వందేళ్ల కిందట పూరి పాకలో పాఠశాల నిర్వహించడమే ఆనాటి పెద్దల సహృదయానికి నిదర్శనమన్నారు. అనంతరం శత వసంతాల సావనీర్‌ను  ఆవిష్కరించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు, పూర్వ విద్యార్థులను సత్కరించారు.శత వసంతాల పైలాన్‌ను మండలి చైర్మన్‌ కొయ్యే మోషన్‌రాజు ప్రారంభించారు.కార్యక్రమంలో  జడ్పీ చైర్మన్‌ కౌరు శ్రీనివాస్‌, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ, పూర్వపు విద్యార్థి శ్రీధర్‌ స్వామి, జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి,  హైదరాబాద్‌ కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు దశరథరామారెడ్డి సతీమణి శ్రీమతి సింధు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-09T06:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising