ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్య ప్రతాపం

ABN, First Publish Date - 2022-05-29T06:44:44+05:30

భానుడి ప్రతాపానికి జనం విలవిల్లా డారు. రెండు రోజుల వాతావరణం చల్లదనంతో సరిపెట్టినా శనివారం ఒక్కసారిగా వేడి గాడ్పులతో హీటెక్కించింది.

ఎండలకు నిర్మానుష్యంగా వున్న కలిదిండి ప్రధాన రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. ఎండకు ప్రజలు విలవిల

ఏలూరు రూరల్‌, మే 28 : భానుడి ప్రతాపానికి జనం విలవిల్లా డారు. రెండు రోజుల వాతావరణం చల్లదనంతో సరిపెట్టినా శనివారం ఒక్కసారిగా వేడి గాడ్పులతో హీటెక్కించింది. రోహిణీ ఎండల వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. భానుడు భగభగ మండుతు న్నాడు. కొద్ది రోజులుగా నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే బయటకు వెళ్లడానికి భయపడే పరిస్థితి ఉంటోంది. ఇప్పటికే పెరిగిన ఎండలకు చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. ఉదయం నుంచి రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలులు పెరగడంతో కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న వారం రోజులు ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు ఎండల తీవ్రత పెరుగుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్ర మే ఇంటి నుంచి బయటికి రావాలని సూచిస్తున్నారు. చెరుకు రసం, కొబ్బరినీళ్ల వ్యాపారాలకు గిరాకీ ఏర్పడింది. కలిదిండిలో ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండడంతో కర్ప్యూ వాతావరణాన్ని తలిపించిం ది. చీకటి పడే వరకు వేడిగాలులు వీచాయి.  

Updated Date - 2022-05-29T06:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising