ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

75 వసంతాల జాతీయ స్తూపానికి అడ్డంకులు

ABN, First Publish Date - 2022-08-14T05:47:19+05:30

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉత్సవ స్ఫూర్తిని గుర్తుండేలా పెనుమంట్ర మండలం మార్టేరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్తూపానికి పోలీ సులు, అధికారులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మార్టేరులో స్తూపం నిర్మాణ దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మాణాన్ని నిలిపివేసిన అధికారులు, పోలీసులు

అఖిల పక్ష నాయకుల ఆగ్రహం

పెనుమంట్ర, ఆగస్టు 13 : దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉత్సవ స్ఫూర్తిని గుర్తుండేలా పెనుమంట్ర మండలం మార్టేరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్తూపానికి పోలీ సులు, అధికారులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్టేరులో నరసాపురం కెనాల్‌ పక్కన ఖాళీ ప్రదేశంలో జాతీయ స్తూపం నిర్మించేందకు అనుమతి ఇవ్వాలని పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. అధికారులు పనులు చేసుకోవచ్చని మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో స్తూపం నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. శనివారం మధ్యాహ్నం సమయంలో పంచాయతీ అధికారులు నిర్మాణ స్థలం వద్దకు వచ్చి పనులు ఆపాలని ఆదేశించడంతో పాటు ఎప్పుడైనా ప్రభుత్వ అవసరాలకోసం స్తూపాన్ని తొలగించేలా అంగీకార పత్రాన్ని తీసుకున్నారని, దీనిపై అఖిల పక్షనాయకులు సంతకాలు చేసి ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగిన అధికారులు, పోలీస్‌ అధికారులతో అక్కడకు వచ్చి పనులను నిలిపివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు అఖిలపక్ష నాయకులతోపాటు ప్రజలు కూడా  ఆశ్చర్యానికి లోనయ్యారు. స్తూపం నిర్మాణానికి అడ్డుపడుతున్న నాయకులు, అధికారులకు జాతీయ స్ఫూర్తి కనిపించడం లేదని వాపోయారు.



Updated Date - 2022-08-14T05:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising