ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహంకారాన్ని పోగొట్టే నిలయమే ఆలయం

ABN, First Publish Date - 2022-05-19T06:35:47+05:30

అహంకారం పోగొట్టే నిలయమే దేవాలయమని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు.

గాలిగోపురంపై కలశాలకు పూజ చేస్తున్న చినజీయర్‌ స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిదండి చినజీయర్‌ స్వామి 

జంగారెడ్డిగూడెం టౌన్‌, మే 18 : అహంకారం పోగొట్టే నిలయమే దేవాలయమని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం గోకులతిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఏడంతస్థుల రాజగోపురం ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఆలయంలో ఏర్పాటుచేసిన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సభలో భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. దేవాలయ సందర్శన వల్ల విలక్షణ ఫలితం ఉంటుదన్నారు. భగవంతుడు రెండు రూపాల్లో ఉంటారని, కనిపించే ఆకారం ఒకటి, కనిపించని ఆకారం మరొకట న్నారు. గాలికి రెండు రూపాలుంటాయని ఒకటి అంతటా వ్యాపించే రూపం అని, అవసరానికి సరిపడా లేని రూపమన్నారు. భగవంతుడు విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడన్నారు. అవ్యక్త రూపం, వ్యక్త రూపంలో భగవంతుడు ఉంటాడన్నారు. భగవంతుడు భయాన్ని పోగొట్టే రూపం అన్నారు. తిండి కోసం భగవంతుడు మన వద్దకు రాడని, మనకు పెట్టడానికి వస్తాడన్నారు. తినే తిండి పవిత్రం చేయడానికి వస్తాడన్నారు. భగవంతుడు మన అవసరాలను తీర్చడానికి, దోషాలను కడగడానికి వస్తాడన్నారు. ఎమ్మెల్యే ఎలీజా, ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-19T06:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising