ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN, First Publish Date - 2022-08-20T05:29:58+05:30

జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా నిర్వహించారు.

కాళ్ళలో ఉట్టి కొడుతున్న యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామాల్లో ఉట్టి కొట్టి సందడి చేసిన యువకులు


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయాల్లో శ్రీకృష్ణుడికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాలకొల్లు ఎర్రవంతెన వద్ద శ్రీకృష్ణుని ఆలయం వద్ద చిన్నారులకు కృష్ణుడు, గోపికల వేషధారణ పోటీలు నిర్వహించారు. కృష్ణాలయం, క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద యువకులు ఉట్టి కొట్టారు. భీమవరం పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలోని వెంకటసాయిబాబా ఆలయంలో ఆలయ నిర్మాణకర్త మల్లినీడి తిరుమలరావు (బాబి) పర్యవేక్షణలో సాయిబాబాకు విశేష పూజలు చేశారు. గునుపూడి సోమేశ్వరస్వామి ఉపాలయంలో కృష్ణుడికి విశేష పూజలు చేశారు. ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యే కంగా పూలతో స్వామివారిని అలంకరించారు. టూటౌన్‌ శ్రీకృష్ణమందిరం, ఇస్కాన్‌ టెంపు ల్‌లో విశేషపూజలు అలంకారాలు చేశారు. మావుళ్లమ్మ ఆలయం, నాచువారి సెంటర్‌, బ్యాంకు కాలనీ, హన్సీ కళ్యాణ మండపం, వేణుగోపాలస్వామి ఆలయం, సుంకర పద్దయ్యగారివీధి, నరహరశెట్టివారి వీధి, మినీ షీర్డీ తదితర ప్రాంతాల్లో ఉట్టి కొట్టారు. వేంకటేశ్వర మూగ, చెవిటి పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించారు. ఆకివీడు పట్టణంలో పలుచోట్ల యువత ఉట్టి కొట్టి బహుమతులు గెలుచుకున్నారు. సిద్ధాపురం, మందపాడు గ్రామాలలో ఉట్టి కొట్టి సందడి చేశారు. కాళ్ళ మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణ, సత్యభామల వేషధారణలతో సందడి చేశారు. కాళ్ళ, పెదఅమిరం, బొండాడ, సీసలి, కాళ్ళకూరు, దొడ్డనపూడి, ఏలూరుపాడు, ఎల్‌ఎన్‌పురం, కలవపూడి, కోపల్లె, జక్క రం, తదితర గ్రామాల్లో యువత ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆచంట మండలంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెదమల్లంలో శ్రీకృష్ణుడి ఆలయం వద్ద ఉట్టి కొట్టారు. పెను గొండ మండలంలో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. తాడేపల్లిగూడెం పట్టణం రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణయోగ ధ్యాన మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంటర్నేషనల్‌ వాకర్స్‌ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పేరిచర్ల ఫౌండేషన్‌ అధ్య క్షుడు మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే పోటీలు నిర్వహించారు. పాలకోడేరు, వేండ్ర, విస్సాకోడేరు, కొండేపూడి, గొరగనమూడి, పెన్నాడ, శృంగ వృక్షం గ్రామాల్లో ఉట్టి కొట్టారు. ఉదయం స్వామివారికి పూజలు చేశారు. కె.పెంటపాడు బైౖరాగి మఠం గోపాలస్వామి, ఆంజనేయస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. కోలాట నృత్యాన్ని ఏర్పాటు చేశారు. అలంపురం శ్రీ కృష్ణమందిరంలో  వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం స్వామివారిని ఊరేగించారు. వీరవాసరంలోని వేణుగోపాలస్వామి దేవస్థానంలో గీతా పఠనం చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉట్టికొట్టి గ్రామోత్సవం నిర్వహించారు. మార్కెట్‌ ఏరియా, పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌ మురళీకృష్ణ మండపం, పల్లపువీధి, పలు వీధులలో ఉట్టి వేడుకలు జరిగాయి. రాయకుదురు ఉమా మూలేశ్వరస్వామి దేవస్థానం వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఉమామూలేశ్వరస్వామి, వేంకటేశ్వరస్వామి దేవస్థానాలు స్వామి వార్లకు గ్రామ సేవ నిర్వహించారు. మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో కొణితివాడ, రాయకుదురు, పెర్కిపాలెం  గ్రామాలలో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పెనుమంట్ర మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. పొలమూరు, వంగల వారివీధి రామాలయం సమీపంలో ఉట్టికొట్టారు. జుత్తిగలోని ఉమావాసుకీ రవిసోమేశ్వరస్వామి ఆలయంలోని లక్ష్మీజనార్దనస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఉండి, యండగండి, కోలమూరు, మహదేవపట్నం, చెరుకువాడ, చిలుకూరు, పెద పుల్లేరు తదితర గ్రామాలలో ఉట్టి కొట్టడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత ఉట్టికట్టి పండుగను ఘజనంగా జరుపుకున్నారు.

Updated Date - 2022-08-20T05:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising