ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిఫార్సు బదిలీలు ఖరారు!

ABN, First Publish Date - 2022-12-16T00:22:30+05:30

టీచర్‌ బదిలీలకు సంబంధించి గురువారం పలు పరిణామాలు చోటు చేసుకు న్నాయి. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ముందు నుంచీ ఊహించినట్టుగానే కౌన్సెలింగ్‌తో నిమిత్తం లేకుండా కోరుకున్న స్థానాల్లో పలువురికి దొడ్డిదారి బదిలీలు ఖరారయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 15 : టీచర్‌ బదిలీలకు సంబంధించి గురువారం పలు పరిణామాలు చోటు చేసుకు న్నాయి. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ముందు నుంచీ ఊహించినట్టుగానే కౌన్సెలింగ్‌తో నిమిత్తం లేకుండా కోరుకున్న స్థానాల్లో పలువురికి దొడ్డిదారి బదిలీలు ఖరారయ్యాయి. ప్రభుత్వ విచక్షణకు లోబడి బదిలీలను చేసుకునేందుకు వున్న అధికారాలను వినియోగించుకుని వీటిని చేసినట్టు చెబుతు న్నారు. ఇలా సిఫార్సు బదిలీలను సాధించుకున్న వారిలో జిల్లా నుంచి కర్నూలు, విజయనగ రం జిల్లాలకు ఇద్దరు బదిలీ అయ్యారు. వీరికి గురువారమే సంబంధిత జిల్లాల కు అంతర్‌ జిల్లా బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాకు ఎవ రూ బదిలీ ఉత్తర్వులు తెచ్చుకోలేదు. వీరితోపాటు మరో టీచరు జిల్లా నుంచి అంతర్‌ రాష్ట్ర బదిలీల్లో భాగంగా తెలంగాణకు బదిలీ అయ్యారు.

జూ వేకెన్సీల జాబితాలో ‘సర్‌ప్లస్‌’ లేనట్టే

బదిలీల కౌన్సెలింగ్‌ షెడ్యూలు ప్రకారం వేకెన్సీల జాబితాల ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ ప్రకారం ఉమ్మడి జిల్లా లో రేషనలైజేషన్‌ ప్రభావం కారణంగా మొత్తం 1139 వేకెన్సీ లు వివిధ సబ్జెక్లుల్లో ఆయా పాఠశాలల్లో వున్నట్టు నిర్ధారణకు వచ్చారు. వీటిలో హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ వేకెన్సీలు 951, ఎస్జీటీలు 178 ఉన్నాయి. ఇవిగాక కేడర్‌ స్ట్రెంగ్త్‌ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 2,617 వెకెన్సీలు నికరంగా వున్నట్టు తేల్చారు. వీటిలో దాదాపు 600లకు పైగా మిగులు (సర్‌ప్లస్‌) వేకెన్సీలు ఉన్నాయి. ఇలా సర్‌ప్లస్‌గా గుర్తించిన వేకెన్సీలను బదిలీ కౌన్సెలింగ్‌ నుంచి మినహాయించనున్నారు. అంటే రాబోయే కౌన్సెలింగ్‌ వేకెన్సీల జాబితా నుంచి సర్‌ప్లస్‌ స్థానాలను తొలగించనున్నారని స్పష్టమైంది. ఉమ్మడి జిల్లాలో గుర్తించిన సర్‌ప్లస్‌ వెకెన్సీల్లో సుమారు 450 ఎస్జీటీ కేడర్‌ వేకెన్సీలే వున్నాయి.

జూ కోర్టుకు వెళ్ళే యోచనలో..

గతేడాది ఉమ్మడి జిల్లాలో పలువురికి హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో అడహక్‌ పద్ధతిన పదోన్నతు లు ఇచ్చారు. వీరంతా ఆయా స్థానాల్లో ఏడాదికిపైగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా కౌన్సెలింగ్‌ మార్గదర్శకాల ప్రకారం వీ రంతా తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభు త్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన కొంద రు పదోన్నతి టీచర్లు, హెచ్‌ఎంలు కోర్టును ఆశ్రయించగా బది లీల నుంచి వారికి (కోర్టును ఆశ్రయించిన వారికి) మినహా యింపు లభించింది. ఇదే క్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు కోర్టు కేసులో ఇంప్లీడ్‌ అయ్యి బదిలీల నుంచి మినహాయింపు పొందేలా యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే వచ్చే ఏడాది జనవరి 12 నాటికి బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలన్న షెడ్యూలుకు ఒకింత ఇబ్బందులు, ఒడిదుడుకులు ఖాయమని చెప్పవచ్చు.

Updated Date - 2022-12-16T00:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising