ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుకాణాల్లో తనిఖీలు

ABN, First Publish Date - 2022-12-31T01:26:41+05:30

ఏలూరు జిల్లా రెడ్‌క్రాస్‌ మాజీ చైౖర్మన్‌, మాజీ ఉపముఖ్య మంత్రి ఆళ్ల నాని ప్రధాన అనుచరుల్లో ఒకరైన జయప్రకాష్‌ (జేపీ)కి చెందిన ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జేసీ అరుణ్‌బాబు శుక్రవారం తనిఖీలు నిర్వహించడం సంచలనం రేపింది.

గన్‌బజార్‌ సమీపంలోని ఎరువుల షాపులో అధికారుల తనిఖీలు జేపీ ఎరువుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, డిసెంబరు 30 : ఏలూరు జిల్లా రెడ్‌క్రాస్‌ మాజీ చైౖర్మన్‌, మాజీ ఉపముఖ్య మంత్రి ఆళ్ల నాని ప్రధాన అనుచరుల్లో ఒకరైన జయప్రకాష్‌ (జేపీ)కి చెందిన ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జేసీ అరుణ్‌బాబు శుక్రవారం తనిఖీలు నిర్వహించడం సంచలనం రేపింది. ఉదయం స్థానిక గన్‌బజార్‌లో జేపీకి చెందిన శ్రీరామాంజనేయ మెన్యూర్స్‌ దుకాణంలోకి సంయుక్తంగా వెళ్లి గంటకుపైగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వేసి ఉన్న షర్టర్‌ను తీయించి మరీ లోపలికి వెళ్లి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితరాలను పరిశీలించి వాటి వివరాలను అడిగారు. దుకాణంలో కొన్ని మెడికల్‌ కిట్లు, మాస్క్‌లు గుర్తించి వెంటనే డీఎంహెచ్‌వోను పిలిపించి విచారించమని ఆదేశించారు. అక్కడ నుంచి వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, తహసీల్దార్‌ బి.సోమశేఖర్‌ను దుకాణాన్ని పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశించి వెళ్లారు. రికార్డులను, స్టాక్‌ నిల్వలు, బిల్లు పుస్తకాలు, స్టాక్‌ ఇన్‌వాయిస్‌లను పరిశీలించారు. స్టాక్‌ రిజిస్టర్‌ 16 రకాల ఎరువులు, లైసెన్సులు వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కంపెనీలు చేస్తున్న సరఫరా, స్టాక్‌ బ్యాలెన్స్‌ను నిశితంగా పరిశీలించారు. పరిశీలనలో అన్నీ సంక్రమంగా ఉన్నట్లు వ్యవసాయశాఖ జేడీ పేర్కొన్నారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.

Updated Date - 2022-12-31T01:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising