ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమీ క్రిస్మస్‌ సందడి

ABN, First Publish Date - 2022-12-24T00:08:50+05:30

సీవీ రామన్‌ పాఠశాలలో ముందస్తు సెమీక్రిస్మస్‌ వేడుకలు శుక్రవారం నిర్వహించారు.

భీమవరంలో చిన్నారి శాంతాక్లాజ్‌ల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకోడేరు, డిసెంబరు 23 : సీవీ రామన్‌ పాఠశాలలో ముందస్తు సెమీక్రిస్మస్‌ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. జీసస్‌ బోధనలు ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్ధులు ప్రదర్శించిన క్రీస్తు జననం నాటిక, కంఠస్త వ్యాఖ్యలు, అభినయ నృత్యాలు, శాంతా క్లాస్‌ ప్రదర్శన అందర్నీ విశేషంగా ఆకర్షించాయి. యూఎస్‌.వినోద్‌, శిరీష బాలకృష్ణ, కీర్తనఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

పాలకొల్లు అర్బన్‌: స్థానిక సన్‌షైన్‌ స్కూల్లో విద్యార్థులు క్రిస్మస్‌ పండుగ చేశారు. స్కూల్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ పాపారావు నాయుడు, ఎం వరలక్ష్మీ, అరుణా నాయుడు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ తాత (శాంతాక్లాస్‌) వేషధారణలో కొందరు విద్యార్థులు చాక్లైట్లు పంచారు. చైతన్య, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, పాల్గొన్నారు. 18వ వార్డులో లూధరన్‌ చర్చి ఆవరణలో కాపవరపు జక్కరయ్య ఆధ్వర్యంలో శుక్రవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్‌ఆరాధన, ప్రార్ధనలు, కీర్తనలు ఆలపించి, దైవజనులు క్రిస్తు పుట్టుకను తెలిపారు.

భీమవరం ఎడ్యుకేషన్‌: భీమవరం కిడ్జ్‌ప్లే స్కూల్‌లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. హ్యాపీ క్రిస్మస్‌ అంటూ చిన్నారులు వేషదారణ, క్రిస్మస్‌ పాటల అందరిని అలరించాయి. ప్రిన్సిపాల్‌ శ్రీలతాదేవి, ఉపాధ్యాయలు, విద్యార్ధులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లోని సమాచార శాఖ కార్యాలయంలో ఏడీ దాసరి నాగార్జున్‌ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించారు. క్రీస్తు సూచించిన శాంతి, కరుణ, ప్రేమ మార్గాలను అనుసరించడం ద్వారా ఉన్నతంగా జీవించగలం అన్నారు. మందగ కేకుని కట్‌ చేసి ఉద్యోగులు పరస్పరం క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు.

Updated Date - 2022-12-24T00:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising