ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికల పాఠశాల లీడర్‌ ఎన్నిక

ABN, First Publish Date - 2022-08-11T05:38:22+05:30

ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కలిగేవిధంగా పాఠశాల లీడర్‌ ఎన్నిక నిర్వహించారు.

పీఎస్‌ఎం బాలికల పాఠశాలలో ఓటు వేస్తున్న విద్యార్థినులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 10: ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కలిగేవిధంగా పాఠశాల లీడర్‌ ఎన్నిక నిర్వహించారు. పీఎస్‌ఎం బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఎస్‌పీఎల్‌, ఏఎస్‌పిఎల్‌ ఎన్నికలు నిర్వహించినట్లు హెచ్‌ఎం భోగేశ్వరరావు తెలిపారు. ఎస్‌పీఎల్‌కు ముగ్గురు, ఏఎస్‌పిఎల్‌గా ఆరుగురు పోటీ చేశారన్నారు. సాధారణ ఎన్నికల మాదిరి బ్యాలెట్‌ బాక్స్‌లో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నిక నిర్వహణకు పీవో, ఏపీవో, ఓపీవో, పోలీసులుగా విద్యార్థులను నియమించామన్నారు. అన్ని తరగతుల విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారని భోగేశ్వరరావు తెలిపారు. ఓట్లు లెక్కింపు అనంతరం తనూజ ముత్యావలి 341 ఓట్లు మెజార్టీతో ఎస్‌పీఎల్‌గా, లీలానందిని 223 ఓట్లు మెజార్టీతో ఏఎస్‌పిఎల్‌గా గెలుపొందినట్లు ప్రకటించారు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు ఏకె.మహాలక్ష్మీ, శ్రీదేవి, హెచ్‌ఎం భోగేశ్వరావు పర్యవేక్షణలో సాగిన ఎన్నిక నిర్వహణకు ఉపాధ్యాయులు సహకరించారు.

Updated Date - 2022-08-11T05:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising