ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: మేయర్‌

ABN, First Publish Date - 2022-06-07T05:52:41+05:30

పర్యావరణాన్ని పరిరక్షిద్దామని నగరపాలక సంస్థ మేయర్‌ నూర్జహాన్‌ అన్నారు.

వీధులను శుభ్రపరుస్తున్న మేయర్‌ నూర్జహాన్‌, కమిషనర్‌ షాహీద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు టూటౌన్‌, జూన్‌ 6:  పర్యావరణాన్ని పరిరక్షిద్దామని నగరపాలక సంస్థ మేయర్‌ నూర్జహాన్‌ అన్నారు. 50వ డివిజన్‌లో స్వచ్ఛ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూర్జహాన్‌ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రపరుచుకోవాలని అన్నారు. ప్రజలు చెత్తను రోడ్ల మీద కానీ డ్రెయిన్‌లలో కానీ వెయ్యకుండా పారిశుధ్య సిబ్బందికి అందించాలని అన్నారు.  కృష్ణా కాల్వ ప్రక్షళనలో భాగంగా కాల్వలో చెత్తను బయటకు తీశారు. అనంతరం స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా 17, 33, 37, 38 డివిజన్లను శుభ్రపరిచారు. కమిషనర్‌ షేక్‌ షాహీద్‌ బాబు రోడ్లను ఊడ్వటమే కాకుండా, మొక్కలు నాటారు. కార్యక్రమంలో కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, మున్నుల జాన్‌గురునాఽథ్‌, అడిషనల్‌ కమిషనర్‌ బాపిరాజు, డిప్యూటీ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు, ఎంహెచ్‌వో నాయక్‌, సెక్రటరీ ప్రభుదాస్‌, డీఈ సత్యనారాయణ, ఏఈ రఫీ పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-07T05:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising