ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌లో నైతికత, పర్యావరణ పరీక్షలు

ABN, First Publish Date - 2022-03-05T05:41:45+05:30

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 7న నైతికత, మానవ విలువలు, 9న పర్యావరణంపై పరీక్షలు జరుగుతాయని ఆర్‌ఐవో చంద్రశేఖరబాబు అన్నారు.

జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో మాట్లాడుతున్న ఆర్‌ఐవో చంద్రశేఖరబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 4: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 7న నైతికత, మానవ విలువలు, 9న పర్యావరణంపై పరీక్షలు జరుగుతాయని ఆర్‌ఐవో చంద్రశేఖరబాబు అన్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్స్‌తో శుక్రవారం ఏలూరులో సమావేశం నిర్వహించారు. నైతికత, మానవ విలువలు, పర్యావరణం పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మాత్రమే ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ వస్తుందన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 220 కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 37,918 మంది పరీక్షలు రాయాల్సి ఉంటుం దన్నారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాన్ని పరీక్ష ప్రారంభ సమయానికి అరగంట ముందుగా కళాశాల ప్రిన్సిపల్స్‌కు పంపిస్తారని, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష నిర్వహించాలన్నారు. పరీక్ష ముగిసిన వెంటనే అదే రోజున సమీప కళాశాలల అధ్యాపకులతో సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయించాలన్నారు.


11 నుంచి ప్రాక్టికల్స్‌ 


ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 11 నుంచి 31 వరకు జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. జనరల్‌ విభాగంలో 57 కేంద్రా లు, ఒకేషనల్‌ విభాగంలో 78 కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, జిల్లా స్థాయి తనిఖీ బృందాలు ఉంటాయని వివరించారు.

Updated Date - 2022-03-05T05:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising