ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌ మిల్లింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-12-10T00:04:45+05:30

జిల్లాలో రైస్‌ మిల్లింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసు కోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు

ఏలూరుసిటీ, డిసెంబరు 9: జిల్లాలో రైస్‌ మిల్లింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసు కోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో పరిశ్రమల శాఖ, పౌరసరఫరాల శాఖాధికారులు, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతి నిధులతో రైస్‌ మిల్లింగ్‌ క్లస్టర్‌, కాటన్‌ ఫెసిలిటీస్‌ సెంటర్‌ ఏర్పాటుపై సమీక్షించారు. జేసీ మాట్లా డుతూ సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల క్లస్టర్‌ డెవ లప్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రైస్‌ మిల్లింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని,దీనిలో భాగంగా కామన్‌ ఫెసిలిటీస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. జిల్లాలో ఇప్పటికే బంగారు ఆభరణాలు, కార్పెట్ల తయారీ పరిశ్రమ లకు సంబంధించి క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని అదే తరహాలో జిల్లాలో ఆహార ధాన్యాలలో వరి ప్రధాన పంటగా ఉన్న నేపథ్యంలో వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు, క్లస్టర్‌లో వివిధ యూనిట్లు నెలకొల్పేలా పారి శ్రామిక వేత్తలు చర్యలు తీసుకోవాలన్నారు. క్లస్టర్లుకు అనుబంధంగా వాటికి అవసరమైన కామన్‌ ఫెసిలిటీస్‌ సెంటర్‌ ఏర్పాటుకు వారు ముం దుకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కామన్‌ పెసిలిటీస్‌ కేంద్రంలో ధాన్యం ఆరబెట్టే యంత్రాలు, గొడౌన్లు ఏర్పాటు, ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ మొదలైవని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసేలా చూడాలని వీటి ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సబ్సిడీలు అందిస్తాయన్నారు. వీటిపై క్లస్టర్‌కు సంబంధించిన విస్తృతమైన అవగాహన కలిగించాలని పరిశ్రమల శాఖాధికారులను జేసీ ఆదేశించారు. సమా వేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఏసుదాసు, డీఎస్‌వో ఆర్‌ఎస్‌ ఎస్‌ఎస్‌ రాజు, పరిశ్రమల శాఖ ఏడీ సుమధుర వాణి, జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసి యేషన్‌ అధ్య క్షుడు ఆళ్ళ సతీష్‌ చౌదరి, కార్యదర్శి కాకి సూరిబాబు, ఏలూరు రైస్‌ మిల్లర్స్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు పీఎన్‌వి ప్రసాద్‌,కార్యదర్శి వేమా సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising