ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మువ్వన్నెల జెండా రెపరెపలు

ABN, First Publish Date - 2022-01-27T05:56:31+05:30

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.

గాంధీజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న కొవ్వూరు ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరించారు. పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాల వద్ద జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. విద్యార్థులకు మిఠాయిలు పంచారు. స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


కొవ్వూరు, జనవరి 26: గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు బుదవారం ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఆర్డీవో ఎస్‌. మల్లిబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని సత్కరించారు. మన్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, కౌన్సిలర్లు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ టి.రవికుమార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం లో రిజిష్టార్‌ సాధనాల శేఖర్‌బాబు, పట్టణ పోలీస్టేషన్‌లో ఎస్‌ఐలు యు. లక్ష్మీనారాయణ, బి.శ్రీనివాస్‌, ఎస్‌ఈబి కార్యాలయంలో సీఐ వి.సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో ఏఈలు, పట్టణం, మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఎగరవేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి తానేటి వనిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. సీతంపేటలోని విద్యుదుత్పత్తి కేంద్రంలో ఏపీజీపీసీఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.చిట్టిబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జీటీపీఎస్‌ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


బుట్టాయగూడెం: కేఆర్‌.పురం ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ పి.వెంకటేశ్వరావు, తహసీల్దార్‌ వైవి.లక్ష్మీకుమారి, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ప్రభుత్వ కార్యాలయా ల వద్ద అధికారులు, కళాశాలలు, పాఠశాలలు వద్ద ప్రిన్సిపాల్స్‌, హెచ్‌ఎంలు జాతీయ జెండా ఎగురవేశారు. ఎంపీపీ కారం శాంతి, వైస్‌ ఎంపీపీ కుక్కల వరలక్ష్మి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


పోలవరం: రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ బి.సుమతి, మం డల పరిషత్‌ వద్ద ఎంపీడీవో సీహెచ్‌.శ్రీనివాస్‌, అటవీశాఖ కార్యాలయం వద్ద అటవీక్షేత్రాఽధికారి ఎన్‌.దావీదురాజు, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ ఆర్‌.శ్రీను, పోలవరం పంచాయతీ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకులు బంగారు కృష్ణ, మెయిన్‌ బజార్‌ గాంధీ విగ్రహం వద్ద చెక్కా వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, సర్పంచ్‌ పొడుం పుష్ప, జడ్పీ టీసీ కలుం హేమకుమారి, ఆర్‌ఐ కాజా రమేశ్‌, గ్రంధి బాలకృష్ణ, పొడుం శ్యాంకుమార్‌, వెంకన్నబాబు, జల్లేపల్లి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T05:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising