AP News: టీడీపీలో చేరిన రెడ్డి గణపవరం వైసీపీ నేతలు
ABN, First Publish Date - 2022-08-29T20:45:29+05:30
జిల్లాలోని బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు(YCP Leaders) టీడీపీ (TDP) కండువా కప్పుకున్నారు. సోమవారం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam srinivasulu) సమక్షంలో పసుమర్తి భీమేశ్వరరావు, బొబ్బర ఎలీషా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరితో పాటు దెర్శిపాము రామకృష్ణ, కొర్సా దుర్గారావు, కోర్శా వంశీ, చాప శివ, చంపన నాగరాజు సహా 50 కుటుంబాలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ... పార్టీలో అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, అందరూ కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గన్నిన సూర్యచందరరావు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ తెలుగురైతు కార్యదర్శి గద్దె అబ్బులు, తెలుగుమహిళా నియోజకవర్గం కార్యదర్శి జారం చాందినీ సాగరిక, గ్రామ పార్టీ అధ్యక్షులు చులకమూడి సుధాకర్, కుందుల శ్రీను, ముళ్ళపూడి హర్ష, ఆచంట శ్రీను, గద్దె సతీష్, గద్దె దుర్గారావు, తూంపాటి దుర్గారావు, పుసులూరి వీర్రాజు, పుసులూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-29T20:45:29+05:30 IST