17 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ABN, First Publish Date - 2022-08-04T06:14:44+05:30
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎస్‌ఐ రంజిత్ కుమార్ బుధవారం పట్టుకున్నారు.
ముసునూరు, ఆగస్టు 3: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎస్‌ఐ రంజిత్ కుమార్ బుధవారం పట్టుకున్నారు. చెక్కపల్లికి చెందిన కల్వకుంట్ల రాధాకృష్ణ రేషన్ బియ్యాన్ని బొప్పన పౌలీ్ట్రస్‌కు తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్‌ఐ దాడి చేశారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. పట్టుబడిన 17 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి, నిందితుడు రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఏఎస్‌వో లక్ష్మణ్ బాబు, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌రావు, వీఆర్వో శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T06:14:44+05:30 IST