ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదోడిపై పగ

ABN, First Publish Date - 2022-12-25T00:37:15+05:30

జగన్‌ ప్రభుత్వం ఆది నుంచి సంక్షేమం విషయంలో చెప్పేదొకటి చేసేదొకటిగా వ్యవహరిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నీ ఇస్తున్నామంటూనే కోతలే కోతలు

13 వేల పింఛన్‌దారులకు నోటీసులు

రేషన్‌ కార్డులు.. కొత్తగా ఇచ్చినవి 4వేలు.. తొలగించేవి నాలుగు రెట్లు

పేదల ఇళ్లల్లో కలకలం..

ఎందుకీ ఆగడాలంటూ ఆగ్రహావేశాలు

రంగంలోకి ప్రతిపక్షాలు.. పేదలకు బాసటగా ఆందోళనలు

13 వేల మందికి నోటీసులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

జగన్‌ ప్రభుత్వం ఆది నుంచి సంక్షేమం విషయంలో చెప్పేదొకటి చేసేదొకటిగా వ్యవహరిస్తోంది. వృద్ధులకు పింఛన్‌ మూడు వేలకు పెంచి ఇస్తామన్న మాటను పక్కన పెట్టేసి, ఇప్పుడు ఏరివేతకు సిద్ధమవుతోం ది. ఏలూరు జిల్లాలో ప్రతీ నెలా 2 లక్షల 65 వేల 813 మంది పింఛనుదారులకు రూ.60 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 11 వేలు, ఆగస్టులో మరో 13 వేల మంది కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా పాత పింఛనుదారుల్లో కరెంటు బిల్లు 300 యూనిట్లు అధికంగా వచ్చిందని, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారనే సాకులతో 6 వేల 500 మందికి నోటీసులు ఇస్తు న్నారు. ఇలా అం దుకోనున్న వారిలో ఒక్క ఏలూరు కార్పొరేషన్‌లోనే 1,500 మంది వరకు ఉన్నారు. మిగిలిన ఐదు వేల మంది గ్రామీణ ప్రాంతాల్లోని అవ్వా తాతలు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 2 లక్షల 18 వేలకుపైగా పింఛన్లు ఉండగా, వీరి కోసం ప్రతీ నెలా రూ.54 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది రెండు విడతల్లో దాదాపు ఏడు వేల కొత్త పింఛన్లకు ఆమోదం చెప్పారు. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో తీసేసేలా ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో భాగంగా పశ్చిమ గోదా వరిలో 6 వేల 230 మందికి కరెంటు బిల్లు గీత దాటిం దంటూ తొలగింపు నోటీసులు జారీ చేస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 13 వేల పింఛన్‌దా రులకు నోటీసులు అందబోతున్నాయి. జనాగ్రహం పెల్లుబుకుతున్న వేళ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికిప్పుడు అభ్యంతరాలను పరిశీలనలోకి తీసుకుని నోటీసులు ఇస్తున్నాం. మీ దగ్గర ఉన్న ఆధారాలేమిటో వలంటీర్లకు అందజేయాలని వివరిస్తున్నారు. మండ లాల వారీగా నోటీసులందించే జాబితాలు విడుదల య్యాయి. ఈ దురాఘాతంపై వైసీపీయేతర పక్షాలన్నీ రంగంలోకి దిగబోతున్నాయి. పింఛన్ల ఏరివేతపై ఆరా తీస్తూ.. ఆయా కుటుంబాలను కలిసి తమ మద్దతు తెలియజేయాలని నిర్ణయించాయి. ‘పాపం మూడొందలు కరెంటు బిల్లు దాటితే ఏకంగా 2 వేల 750 రూపాయల నెలవారీ పింఛన్‌ తీసేయడమేనా. పేదలు ఎవరైనా విలాసాల్లో తేలియాడతారా, పొట్ట కూటి కోసం ప్రాధేయ పడతారా ఇదేంటి..’ అనే కామెంట్లే అన్నిచోట్లా కనిపిస్తు న్నాయి. తాజా పరిణామాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. వలంటీర్లు పరిస్థితిని ఎప్పటి కప్పుడు తమ పైఅధికారులకు వివరిస్తున్నారు.

రేషన్‌ కట్‌.. కట్‌

ఓ వైపు పింఛన్లను ఏరివేస్తూనే మరోవైపు రేషన్‌ కార్డులను వడ బోస్తున్నారు. ఏలూరు జిల్లాలో తెలుపు కార్డులు ఆరు లక్షల 39 వేలు, పశ్చిమ గోదావరిలో ఐదు లక్షల 33 వేలు వెరసి 11 లక్షల 72 వేల కార్డుల్లో కోత పెట్టేందుకు అడ్డగోలు నిబంధనలు తెర మీదకు తెచ్చి వడబోయపోతున్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లాలో రెండు వేలు, పశ్చిమ గోదావరిలో రెండున్నర వేలు మాత్రమే కొత్త కార్డులు జారీచేశారు. కాని వడపోతలో దీనికి నాలుగు రెట్లు తొలగించే అవకాశాలు లేకపోలేదు. క్రిస్మస్‌, జనవరి ఫస్ట్‌, సంక్రాంతి వస్తుందనుకుంటే ప్రభుత్వం కోతలతో వ్యవహారం ఆరంభించింది. రేషన్‌ సరుకులు తీసుకోని వారు తమ కార్డు ఎప్పుడు తొలగిస్తారోనని ప్రతీ నెలా రేషన్‌ వ్యాన్‌ల కోసం ఎదురు చూడడమే సరిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించాల్సింది పోయి ఎందుకిలా గుడ్డెద్దు చేలో పడినట్టు వ్యవహరిస్తారంటూ జనం విరుచుకుపడుతున్నారు. ప్రతీ నెలా రేషన్‌లో ఇంతకుముందు ఉన్న కందిపప్పు మటు మాయమైంది. బహిరంగ మార్కెట్‌లో ఎంత ఖరీదైనా పేదలే భరించాల్సి వస్తుంది. పండ గొస్తే చాలు కాస్తంత సరుకులు పెంచి ఇంతకు ముందు రేషన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం బియ్యం సరఫరాకే అన్నట్టుగా రేషన్‌కార్డు మారిపోయిందనే విషయాన్ని ఇంకొందరు గుర్తు చేస్తున్నారు. ‘రేషన్‌కార్డుల వ్యవహారం చర్చ జరుగుతుంది. త్వరలోనే జాబితాలు రావొచ్చు. దానిని బట్టిగాని ఎన్ని కార్డులు తొలగిస్తామనేది ఇప్పటికిప్పుడు అంచనా వేయలేం’ అంటూ కొందరు అధికారులు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు.

అర్హుల పెన్షన్లు తొలగించం

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 24 : అర్హత ఉన్న ఏ ఒక్క పెన్షన్‌ తొలగించబోమని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ పి.అ రుణ్‌బాబు పేర్కొన్నారు. శనివారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య సామాజిక భద్రతకు పెన్షన్లు, పంపి ణీకి కార్యాచరణ, కొత్త రేషన్‌ కార్డులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జేసీలతో అమరావతి నుంచి జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. అరుణ్‌బాబు మాట్లాడుతూ ‘ప్రస్తుతం జిల్లాలో 17 రకాల లబ్ధిదారులైన 2,65,813 మందికి ప్రతి నెలా రూ.68.02 కోట్లు పెన్షన్‌గా అందిస్తున్నాం. గత ఏడాది జనవరిలో 11,470 మం దికి, ఆగస్టులో 13,748 మందికి కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. 2023 జనవరిలో మరో 9 వేల మందికి కొత్త పెన్షన్లు అందిస్తాం. అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్‌ తొలగించడం జరగదు. అర్హత పరిశీలనలో భాగంగా పెన్షన్‌ పొందుతున్న వారిలో వివిధ కారణాలతో 6,500 మందికి నోటీ సులు ఇచ్చాం. పెన్షన్‌ నిలు పుదల వదంతులను నమ్మవద్ద’ని ఆయన వివరించారు. డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, మెప్మా పీడీ ఇమ్మానియేల్‌, డీఎస్‌వో ఆర్‌.సత్య నారాయణరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-25T00:37:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising