ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ జాతీయ జెండాతో ర్యాలీ

ABN, First Publish Date - 2022-08-11T05:46:43+05:30

ప్రతీ వ్యక్తిలోను దేశభక్తి ఉంటే ఐక్య త సాఽధ్యమవుతుందని, విద్యార్థులు బాల్యం నుంచే దేశభక్తిని అలవరు చుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, ఆగస్టు 10 : ప్రతీ వ్యక్తిలోను దేశభక్తి ఉంటే ఐక్య త సాఽధ్యమవుతుందని, విద్యార్థులు బాల్యం నుంచే దేశభక్తిని అలవరు చుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహో త్సవం.. హర్‌ ఘర్‌ తిరంగా సంద ర్భంగా బుధవారం భీమవరం ఛాం బర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతీ ఇంటా జాతీయ జెండాను ఎగురు వే యాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 15 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలవేసి నివాలర్పించారు. జాతీయ జెండాను అవిష్కరించారు. బెలూన్లను గాలిలోకి ఎగుర వేశారు. పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగుతూ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనానికి చేరుకుంది. మాజీ సైనికులను, రైతులను ఘనంగా సత్కరించారు. ఆర్డీవో దాసిరాజు, మాజీ మం త్రి యర్రా నారాయణస్వామి, తహసిల్ధార్‌ వై.రవికుమార్‌, ఎంపీడీవో జి.పద్మ, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణ గుప్త, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising