ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జంగారెడ్డిగూడెంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ABN, First Publish Date - 2022-08-20T18:55:28+05:30

జిల్లాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): జిల్లాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv gandhi) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెం బందుల దొడ్డి సెంటర్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్  జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాథరావు (Jetti gurunath rao) పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు పోతుందంటే ఆనాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే కారణమన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారని గురునాథ రావు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హిరాకిం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రగల్లపటి పాటి కాశి, పట్టణ కార్యదర్శి సోమేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాడేపల్లి ఉమా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మొగిలినీడిశ్యాం, బీసీ సెల్ అధ్యక్షులు జీడిగంటి రామారావు, కిసాన్ సెల్ విభాగం అధ్యక్షులు పిండి రాము మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ జమీర్, ఎస్పీ సెల్ అధ్యక్షులు దున్న శివ, మామిడి రాము, శ్యామలపల్లి రమణ, ఏలూరిపని కుమార్, పజిల్, షరీఫ్, భగవాన్, గగ్గల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T18:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising