ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP MLC అనంత బాబు Remand నేటితో పూర్తి

ABN, First Publish Date - 2022-07-01T16:04:43+05:30

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబు రిమాండ్ శుక్రవారంతో పూర్తయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి (Rajahmundry): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం (Subrahmanyam) హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu) రిమాండ్ (Remand) శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు మరికొద్ది సేపట్లో  రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎస్సీ, ఎస్టీ కోర్టులో అనంతబాబును హాజరుపర్చనున్నారు.


కాగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్‌ (అనంతబాబు) డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో కాకినాడ పోలీసులు సక్రమంగా విచారణ నిర్వహించడంలేదని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి, సభ్యుడు జి.శ్రీనివాసరావుతో కూడిన బృందానికి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ, సోదరుడు నవీన్‌తో కలిసి గురువారం ఫిర్యాదు చేశారు. సుబ్రహ్మణ్యం హత్యకేసు ఏ విధంగా పక్కదోవ పట్టించే ప్రయత్నం జరిగిందో 58 పేజీల డాక్యుమెంట్‌ ఆధారాలు, కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా మాట్లాడిన సీడీని, ఫిర్యాదు పత్రాన్ని కమిషన్‌కు ఇచ్చినట్టు  తెలిపారు.

Updated Date - 2022-07-01T16:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising