ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా హనుమజ్జయంతి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-05-25T05:44:21+05:30

హనుమజ్జయంతిని పురస్కరించుకుని నందమూరుగరువులోని శ్రీరామ భక్తాంజనేయస్వామి ఆలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

వీరవాసరం మండలం నందమూరుగరువు ఆంజనేయస్వామి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం, మే 24: హనుమజ్జయంతిని పురస్కరించుకుని నందమూరుగరువులోని శ్రీరామ భక్తాంజనేయస్వామి ఆలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్‌ ఆచార్యుల బృందం ప్రత్యేక పూజలను నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంగళవారం స్వస్తి వచనములు, సంకల్పం, విశ్వక్సేన పూజ, దీక్షాధారణ, సువర్చల అమ్మవారి ఉత్సవమూర్తి సంప్రోక్షణ, ప్రధాన హోమం, వాస్తుహోమం, ధ్వజారోహణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలో ముందుగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు.


భీమవరం టౌన్‌: హనుమజ్జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని మంగళవారం ఆలయ ప్రధానార్చకుడు ఘంటసాల భాస్కరశర్మ ఆధ్వర్యం లో ఉదయం రమా సత్యనారాయణ స్వామి వత్రం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారికి సింధూర్చాన, తమలపాకులతో పూజ నిర్వహించి అలంకారం చేశారు.


పాలకొల్లు అర్బన్‌: పట్టణంలోని యడ్ల బజారు పంచముఖాంజనేయ స్వామి, కెనాల్‌రోడ్డులోని దాసోహాంజనేయ స్వామి గుడి, పలు ఆలయాల్లో హనుమజ్జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కెనాల్‌ రోడ్డులోని దాసోహాం జనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు ఎం.శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో గంధ సింధూర, తమల పాకుల పూజలు చేశారు.

Updated Date - 2022-05-25T05:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising