ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-05-20T06:39:15+05:30

పేదల అభ్యున్నతికి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య కృషి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని సీపీఎం మండల కార్యదర్శి పిల్లి మురళీ అన్నారు.

ఆగిరిపల్లిలో సుందరయ్య చిత్రపటం వద్ద సీపీఎం నేతల నివాళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు 

విగ్రహాలు, చిత్ర పటాల వద్ద నాయకుల నివాళి 

ముసునూరు, మే 19: పేదల అభ్యున్నతికి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య కృషి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని సీపీఎం మండల కార్యదర్శి పిల్లి మురళీ అన్నారు. గురువారం మండలంలో సుందర య్య వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. చింతలవల్లిలో పిల్లి మురళీ, గుళ్ళపూడిలో రాయంకుల లక్ష్మణరావు సుందరయ్య చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు. 

నూజివీడు టౌన్‌ : సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి పట్టణంలో పదో వార్డులో సీపీఎం జిల్లా నాయకులు జి.రాజు ఆధ్వర్యంలో ని ర్వహించారు. సీపీఎం నేతలు ఏసుదాసు, జిలాని, వసంతరావు పాల్గొన్నారు. 

కలిదిండి : కలిదిండి సెంటర్‌లో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా గురువారం సీపీఎం నేతలు, ఆటో, రిక్షా కార్మికులు చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు శేషపు మహంకాళిరావు, త్రిమూర్తులు, నాగమణి, కఠారి వెంకమ్మ, వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్‌, పరసా రాజేష్‌, పెరుమాళ్ల గోపి పాల్గొన్నారు. 

ఆగిరిపల్లి : ఆగిరిపల్లిలో సుందరయ్య 37వ వర్ధంతి కార్యక్రమాలను సీపీఎం మండల కార్యదర్శి చాకిరి శివనాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు ఎం.రాజావు, ఎస్‌.కోటేశ్వరరావు, జహంగీర్‌బాషా, సుభాని, ఎం.సుభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

చాట్రాయి : చనుబండలో సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా నాయకులు, కార్యకర్తలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వామపక్ష నాయకులు గజవల్లి వెంకటేశ్వరావు, కె.భాస్కరరావు, గత్తం వెంకటేశ్వరావు, గత్తం రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T06:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising