ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిస్వార్ధ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య

ABN, First Publish Date - 2022-05-20T05:40:02+05:30

నిస్వార్ధ ప్రజా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జేఎన్వీ గోపాలన్‌ అన్నారు.

కొణితివాడలో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహావిష్కరణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, మే 19: నిస్వార్ధ ప్రజా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జేఎన్వీ గోపాలన్‌ అన్నారు. సుందరయ్య వర్థంతి సందర్భంగా గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఆయన ఆశయాలు, నిస్వార్థం, త్యాగాలు, నిజాయితీ, నిరాడంబరత, సేవాగుణాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు బొక్కా సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, పెంకి అప్పారావు, డోకల లక్ష్మి, రవితేజ, గేదెల లావణ్య, ధనుష్‌ తదితరులు ఉన్నారు. భీమవరంలో ‘సోషలిజం భవిష్యత్‌’ అంశంపై సదస్సు నిర్వహించారు. మంతెన సీతారాం, బి.బలరాం, బి.వాసుదేవరావు, నాగేశ్వరరావు, బంగారు వరలక్ష్మ, కే.కృష్ణ పాల్గొన్నారు. జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి ఆఽఽధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అల్లూరి రవి వర్మ, ఇందుకూరి ప్రసాదరాజు, చెరుకువాడ రంగసాయి, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు సీపీఎం కార్యాలయంలో వలవల శ్రీరామమూర్తి నివాళులర్పించారు. గాంధీ బొమ్మల సెంటర్‌లో సుందరయ్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దిగు పాటి రాజగోపాల్‌ పూలమాలలు వేశారు. జవ్వాది శ్రీనివాసరావు, సీహెచ్‌. సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఆచంటలో ఉన్నమట్ల ప్రసాద్‌, తోటపల్లి సత్యనారాయణ, నెక్కంటి కృష్ణమూర్తి, వద్దిపర్తి అంజిబాబు, ఎస్‌వీ ఎన్‌.వర్మ, తలుపూరి బుల్లబ్బాయి, సిర్రా విఘ్నేశ్వరరావు నివాళులర్పించారు. పెనుగొండ మండలంలోని పలు గ్రామాల్లో సుందరయ్య వర్ధంతి  సందర్భంగా నివాళులర్పించారు. సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు, గుర్రాల సత్యనారాయణ, షేక్‌ పాదుషా, పులిదిండి రామారావు, పాల్గొన్నారు. నరసాపురం మీరా గ్రంథాలయంలో సుందరయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కె.పెద్దిరాజు, ఎం.త్రిమూ ర్తులు, రాము, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కాళ్ళలో గొర్ల రామకృష్ణ, మండా సూరిబాబు, గరికిముక్కల ఆజమ్మ, తిరుమల శ్రీనివాస్‌ నివా ళులర్పించారు. తణుకులో పీవీ.ప్రతాప్‌, గార రంగారావు, అడ్డగర్ల అజయకు మారి, దక్షిణమూర్తి, కామన మునిస్వామి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొగల్తూరు సుందరయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పొదిల కృష్ణమూర్తి, యడ్ల చిట్టిబాబు, ఆదూరి సాంబమూర్తి పాల్గొన్నారు.


కొణితివాడలో సుందరయ్య విగ్రహావిష్కరణ

వీరవాసరం: పీడిత ప్రజల విముక్తి కోసం సర్వస్వాన్ని అర్పించిన త్యాగశీలి పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం తదితరులు పేర్కొన్నారు. కొణితివాడలో ఏర్పాటుచేసిన పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అమరజీవుల పేర్లతో శిలాఫలకం ఆవిష్కరించారు. సర్పంచ్‌ బిశెట్టి లక్ష్మీ కోటేశ్వరరావు, నాగరాజు శ్రీనివాసరాజు, యరకరాజు సుబ్రహ్మణ్యరాజు, యరకరాజు హరిబాబు, గొలగాని సత్యనారాయణ, జుత్తిగ నర్సింహమూర్తి, బి.బలరాం, ఆకుల హరేరాం, పోతుల మృత్యుంజయ, బాలం విజయకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising