ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్షణమే విద్యుత్ కోతలను ఆపాలి: రావూరి కృష్ణ

ABN, First Publish Date - 2022-04-07T21:59:22+05:30

పట్టణంలో తక్షణమే విద్యుత్ కోతలను ఆపాలని ప్రభుత్వాన్ని టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం: పట్టణంలో తక్షణమే విద్యుత్ కోతలను ఆపాలని ప్రభుత్వాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ డిమాండ్ చేశారు. గత కొద్దిరోజులుగా విధిస్తున్న విద్యుత్ కోతలకు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులు చీకట్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను కలిసి వివరాలను అడిగారు. హాస్పిటల్‌లో తగినంత జనరేటర్ సదుపాయం లేదని సూపరింటెండెంట్‌ తెలిపారు. 


ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే విద్యుత్ కోతలను ఆపాలని డిమాండ్ చేశారు. 100 పడకల ఆసుపత్రికి తగినంత జనరేటర్‌ని ఏర్పాటుచేసి రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అనంతరం రోగులకు విసన్న కర్రలు, కొవ్వొత్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి బొబ్బర రాజ్ పాల్ కుమార్, షేక్ ముస్తఫా, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, అల్లూరి రామకృష్ణ, తెలుగుయువత అధ్యక్షులు కోనేటి చంటి, మందపల్లి లక్ష్మయ్య, సూరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, చాగంటి సుబ్రహ్మణ్యం, అంబేద్కర్, దుర్గేష్, కరణం రాంబాబు, పుతి శేఖర్, తోట కృపవరం, చిట్టి పోయిన అంజి, చేను ప్రసాద్, కాసగాని ప్రసాద్, ఐ టీడీపీ సాయికృష్ణ, బాబి, నాని, శీలం రాంబాబు, పరిమి కిషోర్, ప్రసాద్ రెడ్డి, ఎం వెంకటేశ్వరరావు, శీలమంతుల రాంబాబు, హర్ష, వైజాగ్ సత్తిబాబు, పితాని నాగు, పోలేటి అంజి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-07T21:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising